ఒక్కసారిగా భారీ కొండచిలువను చూసి గుండెలు గుభేల్‌ | 7 Foot Python Found Hiding Inside Car Bonnet In Mumbai And Locals Left Shocked, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా భారీ కొండచిలువను చూసి గుండెలు గుభేల్‌

Sep 7 2026 5:12 PM | Updated on Sep 7 2026 5:35 PM

  A 7 foot long python was found inside the cars bonnet

ముంబైలోని దహిసర్ వెస్ట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఓ కారులో సుమారు 7 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించడంతో కలకలం రేగింది. నివాస భవనం పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారు బానెట్‌ తెరవగానే అందులో కొండచిలువ కనిపించింది. ఒక్కసారిగా అంత పెద్ద పామును చూసిన అక్కడున్నవారు భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటన దహిసర్ వెస్ట్‌లోని కాందర్‌పాడా ప్రాంతంలో జరిగింది. బాపూ బాగ్వే రోడ్డులోని మహేశ్వర్ భవనం పార్కింగ్‌లో ఓ కారు నిలిపి ఉంది. ఆదివారం సాయంత్రం కారు బానెట్‌ తెరిచినప్పుడు అందులో భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే చుట్టుపక్కల ఉన్నవారిలో ఆందోళన మొదలైంది.

వెంటనే స్థానికులు పాము రక్షణ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బృందం అక్కడికి చేరుకుని కొండచిలువను కారు నుంచి బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించింది. సుమారు 7 అడుగుల పొడవు ఉండటంతో దాన్ని బయటకు తీయడం అంత సులభం కాలేదు. రక్షణ బృందం తీవ్రంగా శ్రమించి కొండచిలువను సురక్షితంగా కారు బానెట్‌ నుంచి బయటకు తీసింది.

కొండచిలువను రక్షిస్తున్న దృశ్యాల వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో కారు బానెట్‌ లోపల కొండచిలువ కనిపించింది. రక్షించిన అనంతరం దానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కొండచిలువను సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంలో వదిలిపెట్టారు. కారు బానెట్‌లో ఇంత పెద్ద కొండచిలువ దాక్కుని ఉండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కొంతసేపు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement