ఫ్యాషన్ ప్రపంచంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ నీతా అంబానీ సదా అందమైన చీరలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా ముంబైలో జరిగిన అబు జానీ సందీప్ ఖోస్లో 40వ వార్షికోత్సవ వేడుక కోసం తనదైన ఫ్యాషన్ శైలితో అద్భుతంగా కనిపించారు. ఈసారి ఆమె సుందరమైన క్రిమ్సన్ చీరలో ఎర్రటి మందారంలో అద్భుతంగా కనిపించారు. ఇది క్లిష్టమైన హస్తకళ, క్లాసిక్ స్టైలింగ్‌కు కేరాఫ్. ఈ ఆరుగజాల ముందురు ఎరుపు రంగు క్రిమ్సన్ చీర..అదే సీక్వెన్స్‌లో పల్లు వెంబడి ఉన్న డిజైన్ ఆ చీరకు ఒక అద్భుతమైన లుక్‌ని అందించాయి.
ఆ కార్యక్రమంలో ప్రకాశవంతమైన ఎరుపు రంగు రాజసం లుక్ తోపాటు పండుగ శోభను ఇచ్చింది. ఈ చీరకు అనుగుణంగా అదే రంగు ఎంబ్రాయిడరీ మ్యాచింగ్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్‌ని చేయడంతో మరింత నిండుదనంతో కనిపించింది. ఈ అద్భుతమైన చేతులు దుస్తులకు మరో కళాత్మకతను జోడించాయి. అలాగే ఆడంబరమైన ఆభరణాలతో హడావిడి చేయకుండా వజ్రాల పెండెంట్‌తో కూడిన సున్నితమైన ఎర్రదారపు నెక్లెస్‌ను, దానికి సరిపోయే వజ్రాలు, రత్నాలతో కూడిన చెవిపోగులతో సింపుల్‌గా కనిపించింది.
చేతికి ధరించిన సూక్ష్మమైన ఎరుపు రంగు రింగు, గాఢమైన రంగు గల చీర దాని కళాత్మక వివరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా చేస్తాయి. అలాగే తన జుట్టుని భుజంపైకి జాలువారేలా ఒత్తైన అలల రూపంలో వదెలెగా వదిలేసేలా తీర్చిదిద్దింది. అలాగే మేకప్‌లో కళ్లు పెద్దవిగా కనిపించేలా కాజల్, నిగనిగలాడే పింక్ పెదవులు, ఎర్రటి బొట్టుతో మెరుగులు దిద్దింది. కాగా, అబు జానీ, సందీప్ ఖోస్లా ద్వయం ముంబై ఫ్లాగ్ షిప్ ముబారక్ బాగ్‌లో ఫ్యాషన్ రంగంలో దాదాపు 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సాయంత్రం తారలతో సందడిగా మారిపోయింది.
ఈ కార్యక్రమానికి ఇషా అంబానీ, రాధికా మర్చంట్, నవ్య నందా, సోనమ్ కపూర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అబుజానీ, సందీప్ ఖోస్లా 1986లో తన సృజనాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది భారత్‌లో అత్యంత గుర్తింపు పొందిన ఫ్యాషన్ కౌచర్‌లో ఒకటిగా నిలిచింది.
(చదవండి: మెడ మెరిసేలా ఇలా చేయండి..! దెబ్బకు నలుపు మాయం)


