తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా | Telangana Assembly Monsoon Session 7th Sep Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

Sep 7 2026 8:38 AM | Updated on Sep 7 2026 4:38 PM

Telangana Assembly Monsoon Session 7th Sep Live Updates

Telangana Assembly Updates..

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

  • రేపు ఉదయం వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్
  • రేపు శాసన సభలో స్పీకర్‌పై తాత మధుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్
  • రేపు సభలో తాత మధు వ్యాఖ్యలపై సభ్యుల స్పీచ్ ఉంటుంది  
  • రేపు మధ్యాహ్నం తర్వాత బీఏసీ మీటింగ్   

    అసెంబ్లీ ఘటనపై హైకోర్టు సీరియస్ 

  • ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం 
  • అసెంబ్లీకి వెళ్తున్నవారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్న
  • అసెంబ్లీ అనేది స్పీకర్ పరిధి 
  • నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్ చర్యలు తీసుకోవాలి
  • మహిళా ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని గుర్తించాలి
  • 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం  

      ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి కామెంట్స్‌

  • దళిత బిడ్డను స్పీకర్‌గా కాంగ్రెస్‌ తీసుకవచ్చింది
  • స్పీకర్‌ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ వ్యాఖ్యలు
  • అధికారానికి శాశ్వతంగా దూరం అవుతామని బీఆర్‌ఎస్‌లో భయం 
  • ఈ ఘటన ఆది కాదు అంతం కాదు 
  • నికృష్టమైన పదజాలం వాడిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి
  • చర్యల తీసుకోవడానికి స్పీకర్‌కు రాజ్యాంగపరమైన అధికారాలు ఉన్నాయి
  • స్పీకర్‌ రూల్‌బుక్‌ ఫాలో అయ్యి కఠిన చర్యలు తీసుకోవాలి
       
  •   వాకౌట్ చేసిన బీజేపీ 
  • అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ వాకౌట్‌ 
  • 22ఏపై చర్చించడం లేదని బీజేపీ వాకౌట్

     హైకోర్టులో బీఆర్‌ఎస్‌ పిటిషన్

  • అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని పిటిషన్‌ 
  • హైకోర్టులో పిటిషన్‌ వేసిన బీఆర్‌ఎస్్
     
  •  ఎమ్మెల్సీపై చర్యలకు ప్రతిపాదన
  • తాతా మధుపై చర్యలకు అసెంబ్లీలో ప్రతిపాదన 
  • సభలో ప్రతిపాదన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం 
  • ప్రతిపాదనను బలపర్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

శాసనసభలో కన్నీరు పెట్టుకున్న స్పీకర్‌

  • స్పీకర్‌ వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క తీవ్ర భావోద్వేగం
  • సీతక్క కంటతడి పెట్టుకోవడంతో భావోద్వేగానికి గురైన స్పీకర్‌
  • తీవ్ర భావోద్వేగంతో కంటతడిపెట్టిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

ఎమ్మెల్సిలు తాత మధు, నవీన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క

  • వారిపై ఎస్సి ఎస్టీ కేసులు పెట్టాలి 
  • సభకు రాకుండా చైర్‌ను కేసీఆర్ అవమానిస్తున్నారు
  • స్పీకర్‌కు కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి
  • బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే దుహంకారం కలిగిన పార్టీ 

స్పీకర్‌ను కించపరిచే కుసంస్కారం నాకు లేదు: తాతా మధు

  • మమ్మల్ని పోలీసులు బూటు కాళ్లతో తొక్కారు
  • నన్ను రక్షించుకోవడం కోసమే అలా మాట్లాడా
  • కాంగ్రెస్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది
  • బీఆర్‌ఎస్‌పై దాడిని కప్పిపుచ్చుకునేందుకే నాటకాలాడుతున్నారు
     

తాతా మధును బహిష్కరించండి: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

  • తాతా మధు వ్యాఖ్యలకు బాధ్యత వహించి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి
  • స్పీకర్‌ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
  • ఎమ్మెల్సీ తాతా మధును చట్ట సభ నుంచి బహిష్కరించాలి

    అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
  • చెప్పలేని భాషతో స్పీకర్‌ను దూషించారు 
  • చట్ట సభ నుంచి తాతా మధును డిస్మిస్‌ చేయాలి
  • తాత మధు చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి
  • ఇది సభకు జరిగిన అవమానం
  • స్పీకర్‌కు జరిగిన అవమానంపై చర్చలో బీజేపీ సభ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా
  • బీజేపీ లేవనెత్తిన అంశాలపై బీఏసీలొ చర్చించి నిర్ణయం తీసుకుంటాం
  • కేసీఆర్ ఫాంహౌస్‌లో కుట్రకు ప్లాన్ వేశారు
  • ఈరోజు అసెంబ్లీ ముందు ప్లాన్ అమలు చేశారు
  • సభాపతినే కాదు,సభాపతి కుటుంబ సభ్యులను అవమానించారు  

మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా?: సునీత

  • సునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్‌..
  • ప్రజాస్వామ్యంలో ఇవ్వాళ్ల చీకటి రోజు.
  • రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఘటన ఇది.
  • ప్రజల పక్షాన పోరాడటమే మేం చేసిన పాపమా?.
  • కోవ లక్ష్మి పట్టుకోకుంటే గ్రిల్స్‌పైన పడిపోయేదాన్ని.
  • మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా?.
  • కేటీఆర్‌, హరీష్‌ రావు లేకుంటే ఇవాళ మమ్మల్ని కిందపడేసి తొక్కేసేవాళ్లు.
  • ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇలా ప్రవర్తించారు?. 
  • రాష్ట్రంలో దుస్యాసన పర్వం కొనసాగుతుంది.
  • మేము ఏం పాపం చేశాం.
  • రాష్ట్ర మహిళలందరూ దాడి జరిగినట్లుగా ఈ ఘటనను భావిస్తున్నాము.
  • అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి..

మహిళా సభ్యులతో ఇలాగేనా ప్రవర్తించేది?: సబిత సీరియస్‌

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబిత కామెంట్స్‌..
  • మా పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు.
  • మేము అసెంబ్లీకి నల్లబట్టలతో వెళ్తే తప్పేంటి?.
  • అసెంబ్లీకి వస్తుంటే అడ్డుకున్నారు.
  • రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌కు బ్లాక్‌ డ్రెస్‌లో వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తే తప్పులేదా?.
  • ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పోలీసులు ఇలా చేశారా?
  • పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరించారు.
  • మహిళా సభ్యులని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు.
  • సునీతా లక్ష్మారెడ్డి చీర లాగేసి కిందపడేసే ప్రయత్నం చేశారు.
  • ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఏం వచ్చింది? ఎందుకు వచ్చింది?.
  • ఇది మాకు జరిగిన అవమానం కాదు.. మహిళా సమాజానికి జరిగిన అవమానం.
  • అసెంబ్లీ ముందు జరిగిన ఘటన హేయమైనది.
  • అసెంబ్లీకి వస్తుంటే అడ్డుకున్నారు. ​

రేవంత్‌ సర్కార్‌, పోలీసులపై హరీష్‌ రావు సీరియస్‌

  • తెలంగాణభవన్‌ వద్ద మరోసారి ఉద్రికత్త.
  • మాజీ మంత్రి హరీష్‌ రావు కామెంట్స్‌..
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారు.
  • కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
  • రాహుల్‌ గాంధీ టీషర్ట్‌ వేసుకుని పార్లమెంట్‌కు వెళ్తే తప్పులేదా?
  • మేము టీ షర్టులు వేసుకుని అసెంబ్లీకి వెళ్తే తప్పా?.
  • బీఆర్‌ఎస్‌ను బయటకు పంపించి 22ఏపై చర్చించాలనుకుంటున్నారు.
  • ఎన్నికల హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే తప్పా?
  • రక్తాలు కారేలా మా ఎమ్మెల్యేలను కొట్టి సభకు రాకుండా అడ్డుకున్నారు.
  • బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించారు.
  • ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు.
  • మా ఆడ బిడ్డల చీరలు లాగుతుంటే మేం చూస్తూ ఊరుకోవాలా?.
  • మా ఆడబిడ్డల గొంతుపట్టి లాగుతుంటే మేం చూస్తూ కూర్చోవాలా?.
  • మీకు నిజాయితీ ఉంటే 22ఏను అజెండాలో పెట్టి చర్చించండి.
  • పోలీసుల తీరు దుర్మార్గంగా ఉంది.
  • జగదీష్‌ రెడ్డికి హైబీపీ ఉందని చెప్పినా అడ్డుకున్నారు.
  • రేవంత్‌ ఆదేశాలతోనే పోలీసులు రెచ్చిపోయారు.
  • భవిష్యత్‌లో పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు.
  • మా టీషర్టులపై అభ్యంతరకర పదాలు ఎక్కడున్నాయి??
  • సభకు రాకుండా కావాలనే మమ్మల్ని అడ్డుకున్నారు. 

 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..

  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే నో డౌట్..
  • తాతా మధుపై చర్యలు తీసుకోవాల్సిందే..
  • దలిత స్పీకర్‌పై ఇంత దారుణంగా మాట్లాడుతారా?
  • మేము స్పీకర్‌ను ఏమనకున్నా నన్ను, సంపత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో సస్పెండ్ చేశారు.
  • తాతా మధు లాంటి వారిని ఉపేక్షిస్తే స్పీకర్ పదవిని అగౌరపరిచినట్టే అవుతుంది.
  • తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధుపై స్పీకర్‌ ఆగ్రహం..

  • తాతా మధు వ్యవహారంపై స్పీకర్ ఆగ్రహం.
  • స్పీకర్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను రిలీజ్‌ చేసిన సీఎంవో..
  • తాతా మధుపై చర్యలకు సిద్ధం అవుతున్న స్పీకర్
  • మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని కాం‍గ్రెస్‌ నేతల డిమాండ్‌. 

ఆసుపత్రికి బీఆర్‌ఎస్‌ నేతలు.. అడ్డుకున్న పోలీసులు.. 

  • గాయాలైన బీఆర్‌ఎస్‌​ ఎమ్మెల్యేలను నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తామన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
  • జగదీష్‌ రెడ్డి, సంజయ్‌, యాదవరెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసులు.
  • తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు..
  • జగదీష్ రెడ్డి పల్స్ రేటు పడిపోతుందంటూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆగ్రహం
  • శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పిన సంజయ్‌.
  • మాట్లాడలేకపోతున్నా జగదీష్ రెడ్డి.
  • జగదీశ్‌ రెడ్డికి హైబీపీ.. ఆరోగ్య పరిస్థితి విషమం​.
  • స్పృహ తప్పే ప్రమాదం ఉందంటున్న డాక్టర్ సంజయ్
  • పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు 

శాసనసభలో మీడియాపై ఆంక్షలు

  • తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
  • అసెంబ్లీ లాబీలోకి మీడియాకు నిషేధం
  • మీడియాకు LOP సైడ్ లాంజ్ ఏర్పాటు చేసిన అధికారులు
  • మంత్రుల ఛాంబర్ల వరకు మీడియా అనుమతి నిషేధం విధించిన ప్రభుత్వం
  • అసెంబ్లీలో మీడియాకు కనీసం టాయిలెట్స్, మంచి నీళ్లు లేని వైనం
  • అసెంబ్లీ బయట మీడియా కమిటీ కోసం ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చెసినట్లు తెలిపిన అధికారులు
  • అసెంబ్లీ లాబీలోకి మీడియా అనుమతి నిషేధించాలని మంత్రులు ఏకగ్రీవంగా స్పీకర్‌కు తెలిపినట్లు చెప్పిన అధికారులు

సీఎం రేవంత్‌ అత్యవసర సమావేశం..

  • అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం.
  • మంత్రులు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం.
  • బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు వ్యవహరించిన తీరుపై సీఎం ఆరా.
  • పోలీసులు, స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలిస్తున్న రేవంత్‌ రెడ్డి 

పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

  • అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్
  • డ్యూటీ చేయండి, అతి చేయకండి
  • రెండేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది గుర్తు పెట్టుకోండి
  • మేము నల్ల దుస్తులతో అసెంబ్లీలోకి రావొద్దని స్పీకర్ రాతపూర్వకంగా చెప్తే, ఏదైనా రూల్ ఉంటే చూపించండి
  • తెలంగాణభవన్‌ చేరుకున్న కేటీఆర్‌, హరీష్‌
  • పోలీసుల కారణంగా గాయాలు కావడంతో కేటీఆర్‌కు ప్రాథమిక చికిత్స
     

Video credits.. TV9 And Telugu Scribe

స్పీకర్‌ ఆదేశాలతోనే బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకున్నాం: డీసీపీ

  • డీసీపీ శిల్పవల్లి కామెంట్స్‌..
  • స్పీకర్‌ ఆదేశాలతోనే బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకున్నాం
  • షర్ట్‌లు లేకుండా అసెంబ్లీకి ఎలా వెళ్తారు?
  • మహిళా నేతల చీరలు లాగామనడం అవాస్తవం. 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్‌చాట్‌..

  • కేసీఆర్ కాళేశ్వరం విషయంలో ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.
  • కేసీఆర్ నేనే ఇంజనీర్‌ను అని కాళేశ్వరం కట్టి కూల్చారు.
  • కేసీఆర్ బీజేపీకి సరేండర్ అయ్యారు.
  • కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే ప్రజలు నవ్వుతున్నారు.
  • పెండింగ్ ప్రాజెక్టలను పూర్తి చేయొద్దు అని ఎవరు అడ్డుకున్నారు?
  • నీళ్లు లేకపోవడానికి ఒకటి ఎల్‌నినో.. మరొకటి కేసీఆరే కారణం!!
  • నీళ్ల పంపకాల విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారు.
  • కేసీఆర్ మాటలు అన్ని తెలిసినట్లే ఉంటాయి.
  • కేసీఆర్ వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ వాడలేదు.
  • తెలంగాణ భాష ఇలా అవ్వడానికి కేసీఆరే కారణం.
  • కేసీఆర్ నిర్ణయం వల్లే ఇవ్వాళ్ళ నీళ్లు లేవు.
  • ఎండాకాలం తాగునీరు అవసరాల దృష్ట్యా నీరును చాలా పొదుపుగా వాడుతున్నాం..
  • ఇరిగేషన్ విషయం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉంటేనే బెటర్‌.
  • నీళ్లు ఉండి మేము ఇవ్వడం లేదా?.

అసెంబ్లీ మీడియా పాయింట్

  • పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ కామెంట్స్‌..
  • దిక్కుతోచని పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీ ఆందోళన చేస్తున్నాయి
  • 22ఏ భూముల మీద బీఏసీలో చర్చిద్దామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు
  • సభకు రాకుండా బీఆర్‌ఎస్, సభకు వచ్చి బీజేపీ నిరసన తెలుపుతున్నాయి
  • 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులను కాంగ్రెస్ చేసింది
  • బీఆర్ఎస్, బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారు
  • కాళేశ్వరం మీద సీబీఐ విచారణ వేయాలని బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు?
  • బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని మరోసారి రుజువైంది.


ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కామెంట్స్‌..

  • బీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యేలు పోలీసుల మీదే దాడులు చేస్తున్నారు.
  • బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు
  • సభలో అన్నింటిపై చర్చకు సీఎం సిద్ధంగా ఉన్నారు
  • 22ఏపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది
  • మీ బట్టలు ప్రజలు ఎప్పుడో విప్పారు


ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ కామెంట్స్‌..

  • అసెంబ్లీ లోపలికి కాదు.. ఫార్మ్ హౌస్‌లో నల్ల చొక్కాలతో నిరసన తెలపాలి
  • సభ సమయం వృథా చేయకండి
  • సభలో బీజేపీ డ్రామా చేస్తోంది.
  • కేటీఆర్ బృందం పోలీసులపై దాడి చేశారు
  • పోలీసుల ఛాతీపై చేతులు వేసి దురుసుగా ప్రవర్తించారు
  • హరీష్ నల్ల చొక్కాతో వద్దు అంటే.. చొక్కా విప్పి రావడం సంప్రదాయమా? 

రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు..

  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను అసెంబ్లీ రాకుండా వ్యవహరించిన పోలీసులు, ప్రభుత్వం
  • ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు.
  • పార్టీ నాయకులు ఎక్కడిక్కడ నిరసన వ్యక్తం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు
  • మరోవైపు.. కేటీఆర్‌, హరీష్‌ సహా బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. 

అసెంబ్లీకి ముట్టడికి బీజేవైఎం ప్రయత్నం.. 

  • అసెంబ్లీకి ముట్టడికి వచ్చిన బీజేవైఎం నేతలు..
  • వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేసిన పోలీసులు.
  • ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌. 

కాసేపు అసెంబ్లీ వాయిదా..

  • కూనంనేని కామెంట్స్‌..
  • సభకు బీజేపీ సభ్యులు సహకరించాలి..
  • 22Aపై చర్చకు సిద్ధం అని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి బీజేపీ సభ్యులు ఓపికతో ఉండాలి.
  • బీజేపీ సభ్యుల ఆందోళన మధ్య శాసనసభకు విరామం
  • కాసేపు అసెంబ్లీ వాయిదా.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్‌

  • బీఆర్ఎస్‌తో బీజేపీ కుమ్మక్కు అయింది.
  • సభను ఉద్దేశ్యపూర్వకంగా బీజేపీ సభ్యులు అడ్డుకుంటున్నారు..
  • చర్చకు సిద్ధం అన్నాక కూడా ఈ రాద్ధాంతం ఎందుకు?.

 

కొండా సురేఖ దూరం..

  • అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం.
  • కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సురేఖ.
  • సెషన్‌ మొత్తానికి దూరంగా ఉండాలని సురేఖ నిర్ణయం?

పోలీసులు, ప్రభుత్వంపై సబిత, సునీత ఆగ్రహం.. 

  • అసెంబ్లీ వద్ద మాకు అవమానం జరిగింది.
  • మా పట్ల జరిగిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాలి: బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు.
  • లేదంటే స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 
  • తన మెడ పట్టుకుని తోసేయడంపై సబిత ఆగ్రహం
  • తన చీరను లాగారని కన్నీరు పెట్టుకున్న సునీత
  • అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్న మహిళా ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు.
  • నిరసన చేయడం ఎమ్మెల్యేల హక్కు: సబితా ఇంద్రా రెడ్డి.
  • టీ షర్ట్స్ పై స్లోగన్స్ రాయొద్దు అని ఎక్కడైనా అసెంబ్లీలో చట్టం ఉందా?
  • మహిళా ఎమ్మెల్యేల మీద దాడి ప్రభుత్వం దుశ్చర్య: సునీత లక్ష్మారెడ్డి  
  • నాపై జరిగిన దాడికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే.
  • నాపై దాడితోపాటు ఎమ్మెల్యేలపై దాడి చేసినందుకు స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తాం.
  • తప్పు చేసిన అధికారులపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే.
  • ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. 
  • మరోవైపు.. తెలంగాణభవన్‌ చేరుకున్న కేటీఆర్‌, హరీష్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.

సభలో బీజేపీ సభ్యుల నిరసన..

  • 22-ఏపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్..
  • మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..
  • సభ సజావుగా జరిగేలా బీజేపీ సభ్యులు చూడాలి.
  • ఈ సెషన్‌లో 22A పై షార్ట్ డిస్కషన్ చేస్తాం.
  • వాయిదా తీర్మానంపై ప్రొసీజర్‌ ప్రకారమే ఉంటుంది.
  • ఏ నుంచి జెడ్‌ వరకు చర్చకు సిద్ధంగా ఉన్నాం.
  • ఏ అంశమైనా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు.
  • సామాన్య ప్రజానీకానికి ఏ మాత్రం ఇబ్బంది లేని సలహాలేవి ఇచ్చినా తీసుకుంటాం. 

కేటీఆర్‌కు గాయాలు.. కన్నీటి పెట్టిన సునీత.. 

  • పోలీసులకు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మధ్య తోపులాట.  
  • ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకుంటున్న పోలీసులు
  • రోడ్డుపైనే బైఠాయించి పోలీసుల తీరుకు, ప్రభుత్వం తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు
  • కేటీఆర్‌, హారీష్‌ రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు.
  • శాసనసభ ముందు కన్నీరు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి..
  • తనపై పోలీసులు దాడి చేశారని, నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
  • మరోవైపు సబిత, సునీతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
     

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

  • అసెంబ్లీలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి “దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్” ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
  • హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. 

  • అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, కేటీఆర్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.
  • పోలీసులు నెట్టేశారని సునీత లక్ష్మారెడ్డి కంటతడి
  • ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నెట్టేసిన పోలీసులు
  • తోపులాటలో కేటీఆర్‌ చేతికి గాయంమైనట్లు తెలుస్తోంది. 
  • తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
  • ప్లకార్డులతో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • నల్ల టీషర్ట్స్‌తో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు. 
  • బీఆర్‌ఎస్‌ నేతలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు. 
  • పోలీసులతో బీఆర్‌ఎస్‌ నేతల వాగ్వాదం
  • తోపులాటలో కిందపడిపోయిన హరీష్‌ రావు, జగదీష్‌రెడ్డి. 

గన్‌పార్క్‌ వద్ద కేటీఆర్‌ కామెంట్స్‌..

  • కాంగ్రెస్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది.
  • కాంగ్రెస్‌ మోసాలను అసెంబ్లీలో నిలదీస్తాం.
  • హామీల అమలుపై పోరాటం చేయాలని మా నాయకుడు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.
  • 100 రోజుల్లోనే ఇస్తామన్న రూ.15000 రైతు భరోసా ఏమైంది?.
  • నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం రూ.82000 బాకీ పడింది.
  • జాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది?.
  • రియల్‌ ఎస్టేట్‌ కోసం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలి.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టింది.
  • సింగరేణిలో దోపిడీపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం.
  • నెలరోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి.  

 

బీఆర్‌ఎస్‌, బీజేపీకి కౌంటర్‌.. చర్చకు సిద్ధమైన ప్రభుత్వం

  • 22-ఏ, ఫీరియింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధమైన ప్రభుత్వం.
  • బీఏసీలో రెండు అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం.
  • బీఏసీలో ప్రభుత్వం తరఫున ప్రతిపాదన పెట్టనున్న మంత్రి శ్రీధర్‌ బాబు.
  • కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. 

గన్ పార్క్..

  • అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • భూ భారతిలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలంటూ నినాదాలు..
  • 22ఏ భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చేయాలని డిమాండ్..
  • అసెంబ్లీ గేట్ వద్ద తోపులాట
  • ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట..
  • సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు..
  • ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాగేసుకున్న పోలీసులు

గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత..

  • గన్‌పార్క్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన.
  • గన్‌పార్క్ వద్దకు ఎమ్మెల్యేలు వస్తుంటే అడ్డుకున్నారని పోలీసులతో బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదం.
  • అసెంబ్లీ బయట ప్లకార్డులను అడ్డుకోవడానికి పోలీసులు ఎవరంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యేలు
  • 22A సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్‌

అసెంబ్లీ మీడియా పాయింట్

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కామెంట్స్‌.. 
  • అధికార పక్షంతో సహా మాకు సమాన హక్కులు ఉండాలి.
  • అసెంబ్లీలో ఇంతమంది మార్షల్స్ ఎందుకు?.
  • మమ్మల్ని ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
  • సీఎంకు రూల్స్ తెలియవు.. కానీ శ్రీధర్ బాబుకు అన్నీ తెలుసు.
  • రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది.
  • శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి..
  • ముఖ్యమంత్రి గుండ్లు పీకుతా,పేగులు మెడలో వేసుకుంటా అనడం వల్లే క్రైం రేటు పెరుగుతుంది.
  • కనీసం నెల రోజులు సభ జరపాలి.

నల్ల చొక్కాలతో బీఆర్‌ఎస్‌ నేతలు..

  • నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ నేతలు.
  • హామీల అమలులో కాంగ్రెస్‌ విఫమైందని నిరసనలు
  • కాంగ్రెస్‌వి 420 హామీలంటూ ఆగ్రహం 

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు

  • అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ
  • ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ఇందిరాపార్క్ ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ
  • మరోవైపు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి రానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు
  • 22A పై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ
  • కనీసం 15 రోజులు సభను నడిపించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  • అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది.
  • ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ మండలి సమావేశాలు వాడీవేడిగాసాగే అవకాశం ఉంది.
  • ప్రశ్నోత్తరాల తర్వాత మూడు ప్రధాన అంశాలకు సంబంధించిన నివేదికలు సీఎం టేబుల్‌ చేయనున్నారు.
  • తెలంగాణ సమగ్రశిక్ష 2024–25 ఆడిట్‌ నివేదిక, పీఎం శ్రీ తెలంగాణ 2024–25 ఆడిట్‌ నివేదిక ప్రవేశపెట్టనున్నారు.
  • మెట్రోకు సంబంధించి ఐదు వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి.
  • 22ఏ భూముల వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
  • 22ఏపై అన్నివిధాలుగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
  • రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.


సర్పంచ్‌ల కోసం బిల్లు..

  • ఈ నెల 11 వరకే శాసనసభ నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం?
  • ఎన్ని రోజులు నిర్వహించాలనే నిర్ణయంపై బీఏసీలో క్లారిటీ.
  • తెలంగాణ శాసన సభలో కీలక బిల్లు.
  • నిధులు నేరుగా సర్పంచులకే అందేలా అసెంబ్లీలో బిల్లు పెట్టనున్న ప్రభుత్వం


బీఆర్‌ఎస్‌ వ్యూహం..

  • ఉదయం 9 గంటలకు గన్ పార్ట్ దగ్గర అమరులకు బీఆర్‌ఎస్‌ నేతల నివాళులు. 
  • అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ వ్యూహం
  • ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో దిశానిర్ధేశం చేసిన కేసీఆర్
  • ప్రజా సమస్యలపై చర్చకు నెలరోజుల సభకు బీఆర్ఎస్ డిమాండ్
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీఆర్ఎస్ ఫోకస్
  • విద్యార్థుల సమస్యలపై సభలో గళమెత్తనున్న గులాబీ పార్టీ
  • కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్లాన్
  • 22A భూముల అంశాన్ని సభలో లేవనెత్తనున్న బీఆర్ఎస్
  • కరెంట్ కోతలు, రుణమాఫీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్న బీఆర్ఎస్
  • ఉద్యోగుల పీఆర్సీ, డీఏలపై ప్రభుత్వంపై ఒత్తిడి
  • ఈహెచ్ఎస్, పాలిటెక్నిక్ జీవో 97పైనా ప్రశ్నలు
  • సింగరేణి అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్న గులాబీ పార్టీ
  • రైతులు, విద్యార్థులు, ఉద్యోగులే బీఆర్ఎస్ ప్రధాన అజెండా
  • సభకు తప్పకుండా హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించిన కేసీఆర్
  • అసెంబ్లీ సమావేశాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేలా బీఆర్ఎస్ ప్లాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement