భర్త తన ఫోన్ ఎత్తలేదని క్షణాకావేశంతో ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. టౌన్ ఎస్సై బషీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామా నికి చెందిన దారావత్ శారద కుమార్తె అఖిల (20)ను రెండేళ్ల క్రితం మహ బూబాబాద్‌కు చెందిన బానోత్ హుస్సేన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె. హుస్సేన్ మహబూ బాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో మేనేజ రుగా ఉద్యోగం చేస్తున్నాడు.
అఖిల ఇటీవల తన తల్లిగారింటికి వెళ్లింది. పాప ఏడుస్తోందని భర్తతో మాట్లాడేందుకు ఈ నెల 2వ తేదీన వీడియో కాల్ చేయగా, అతను కాల్ లిఫ్ట్ చేయ లేదు. దీంతో అఖిల వెంటనే మహ బూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటికి వచ్చింది. కొంత సమయం తర్వాత ఆమె తల్లి కూడా వారింటికిరాగా అప్పటికే అఖిల అపస్మార కస్థితిలో ఉండటంతో వెంటనే హుస్సేన్‌కు ఫోన్ చేసింది. అతను ఇంటికి వచ్చి అఖిల ఎలుకల మందు పేస్టు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించగా, సోమవారం తెల్లవారుజామున అఖిల మృతిచెందింది.
మహబూబాబాద్ రూరల్/నెక్కొండ:
చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?


