సాక్షి, హైదరాబాద్: ఈ రోజు సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించేలా మాట్లాడారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అంశమై మాట్టాడుతూ తీవ్ర భావోద్వేగానికు గురై కంటతడి పెట్టుకుంది.
ఆ అంశమై సీతక్క మాట్లాడుతూ "స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకుండా స్పీకర్ ఛైర్‌ను అవమానిస్తున్నారు. ఈఘటనపై కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి. బీఆర్‌ఎస్ అంటేనే అహంకార పార్టీ" అని సీతక్క అన్నారు. కాగా ఈ సమయంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అంతా చూస్తున్న స్పీకర్ ఆమె కంటతడి పెట్టుకోవడం పట్ల భావోద్వేగానికి గురై తాను కంటతడి పెట్టుకున్నారు. ఈ సన్నివేశంతో అసెంబ్లీలో ఒక్కసారిగా గంభీరమైన వాతావరణం నెలకొంది.
ఏం జరిగింది?
కాగా ఈ రోజు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సభలకు బీఆర్ఎస్ సభ్యులు నల్లచొక్కాలు వేసుకరావడాన్ని నిరసిస్తూ పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్పీకర్ అన్న మర్యాద లేకుండా అ సభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీనిపై సీఎం రేవంత్ సైతం అసెంబ్లీలో స్పందించారు.
రేవంత్ మాట్లాడుతూ.. స్పీకర్‌ని ఎమ్మెల్సీ తాతా మధు చెప్పలేని భాషతో దూషించారని ఆయన చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, చట్టసభనుంచి ఎమ్మెల్సీ తాత మధును వెంటనే డిస్మీస్ చేయాలని అన్నారు.



