కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్ | Shailajanath Protests At Anantapur Collectorate, Demands Tungabhadra Water Release For Farmers, Check Details Inside | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్

Sep 7 2026 11:25 AM | Updated on Sep 7 2026 11:44 AM

Does the coalition government lack sincerity Former Minister Sailajanath

అనంతపురం: తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా ఆయకట్టు రైతులకు సాగు నీరు విడుదల చేయాలని కోరుతూ, ఎండిపోయిన వేరుశనగ, కంది మొక్కలను ప్రదర్శిస్తూ మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురం కలెక్టరేట్ వద్ద  నిరసన  తెలిపారు. అలాగే రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. శింగనమల నియోజకవర్గానికి సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర ఎగువ కాలువ నీటి పంపకాల్లో తేడా ఉందని, హెచ్ ఎల్సీ, హంద్రీనీవా నీరంతా తాగునీటి అవసరాలకే అంటే ఎలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా చేస్తే రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రైతుల సమస్యలపై టీడీపీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అంటూ మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement