రాష్ట్రపతి భవన్‌కు చేరిన ఎన్‌ఆర్‌ఐ గోడు | NRI Student Abhishek Illegal Lookout Notice To TDP Leader | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్‌కు చేరిన ఎన్‌ఆర్‌ఐ గోడు

Sep 7 2026 7:52 AM | Updated on Sep 7 2026 8:42 AM

NRI Student Abhishek Illegal Lookout Notice To TDP Leader

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అమెరికాలో ఉంటున్న పెనగలపాటి అభిషేక్ నాయుడు అనే విద్యార్థికి ఏపీ పోలీసులు ఇచ్చిన లుకవుట్‌ నోటీసు కలకలం రేపుతోంది. ఇదే అంశంపై తనకు పోలీసులు చేసిన అన్యాయాలు రాష్ట్రపతిభవన్‌ను తాకాయి. కేంద్రహోంశాఖకు ఈ ఫిర్యాదును బదిలీ చేసింది. ఇప్పుడు పోలీసువర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఈ వ్యవహారం జరిగేటప్పటికి అన్నమయ్య జిల్లాలో పుల్లంపేట మండలం ఉంది. ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మారింది.  

ఖాకీపై స్వారీ చేస్తున్న ఆయనెవరు.. 
ఎన్‌ఆర్‌ఐ విద్యార్ధికి పోలీసు వేధింపుల వెనుక ఖాకీల స్వారీ చేస్తున్న నాయకుడు పుల్లంపేటలో కమ్మ సామాజికవర్గాని చెందిన ఓ వ్యక్తి. ఇతను తన స్నేహితుడు ఓ పోలీసు ఉన్నతాధికారి పవర్‌ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోని పోలీసులను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని కబ్జాలు..అక్రమకేసులుపెట్టడంతోపాటు అన్నింటిని కానిం చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగగానే వినిపిస్తున్నాయి  

ఖాకీపై స్వారీ చేస్తున్న వ్యక్తి వల్ల రాజంపేట (కడపజిల్లా), పుల్లంపేట (తిరుపతి జిల్లా)లో కూడా పోలీసులపై పెత్తనం సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇతని చేతిలో టీటీడీ అధికారంలోకి వచ్చిన అనేక మంది డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐ బదిలీలకు కారకుడయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన పోలీసులతో దందా నిర్వహిస్తున్నారని ఆరోపణలు పోలీసువర్గాల్లో వినిపిస్తున్నాయి.  

రాష్ట్రపతికి ఫిర్యాదు.. 
ఆగస్టు 14..2026న పోలీసులు బాధితుడు స్వయంగా భారతరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి , ప్రధానమంత్రి,కేంద్రహోంశాఖ,ఏపీముఖ్యమంత్రి, డీజీపీతో పాటు సహా పలువురికి ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 3న రాష్ట్రపతి భవన్‌ నుంచి ఫిర్యాదు కేంద్రహోంశాఖకు బదిలీ అయింది.  

స్వస్థలం రాలేక.. 
తిరుపతిజిల్లా పుల్లంపేట మండలానికి చెందిన  అభిషేక్ అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చదవి, స్వదేశానికి తిరిగిరావాలనుకున్నా ఇప్పుడు సొంత జిల్లాలో అడుగుపెట్టేందకు హక్కులేకుండా పోయింది. ఇందుకు కారణం ప్రధానంగా భారత్‌ వదలిన తర్వాత నమోదైన ఒక తప్పుడు ఎఫ్‌ఐఆర్, ఆ తర్వాత అతని పాస్‌పోర్టు వివరాలు అతనికి తెలియకుండానే సేకరించి జారీచేసిన లుక్‌అవుట్‌ సర్కులర్‌ (ఎల్‌వోసీ). మే 24న వేసవిసెలవులకు ఇండియాకు వచ్చిన పెనగలపాటి అభిషేక్(పుల్లంపేట మండల పీవీజీ పల్లె) ఆ సమయంలోనే గ్రామకంఠం భూమిపై వివాదం రాజుకుంది. ఆగస్టు 8న బెంగళూరు విమానాశ్రయం నుంచి అమెరికాకు తిరిగి వెళ్లారు. 

అదేరోజు 9 గంటలకు అభిషేక్ దేశం విడిచి కేవలం గంటల్లోనే , పోలూరు కృష్ణమూర్తి అనే వ్యక్తి పుల్లంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామకంఠం, అంటే ప్రభుత్వభూమి తన సొంతభూమిగా చూపించారు. పోలీసులు ఆ ఫిర్యాదును 133/2024గా నమోదుచేశారు. ఏ2గా చేర్చారు. అభిషేక్‌ కుటుంబీకులు, అతని కుటుంబం కానీ పాస్‌పోర్టు వివరాలను పోలీసులకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఎల్‌ఓసీలో తన పాస్‌పోర్టు నంబరుకు ఎలా వచ్చిందన్న అనుమానాలు లేవనెత్తారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడానికి ముందే, బహిరంగంగా , చెల్లుబాటు అయ్యే వీసాపై, ఏ నోటీసు అందలేదు, ఏ సమన్లూ జారీ కాలేదు. కోర్టు ప్రకటన కూడాలేదు. అయితే పోలీసుశాఖలో పరారీలో ఉన్న నిందితునిగా అభివర్ణించి, ఆ ఆధారంగా ఎల్‌వోసీ తెప్పించారు.  

పీజీఆర్‌ఎస్‌లో ఇలా.. 
తిరుపతి పీజీఆర్‌ఎస్‌కు సంబంధించిన అధికారి ఇచ్చిన నివేదిక (209/206)–22.07.2026న ప్రకారం వివాదస్పద భూమి సర్వే నంబర్‌ 885లోని గ్రామకంఠం అంటే ప్రభుత్వభూమి, ఫిర్యాదుదారుకు దానికిపై చట్టబద్ధమైన స్వా«దీనం లేదని, పట్టా కూడా లేదని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రభుత్వభూమిపై ప్రైవేట్‌ వ్యక్తి పేరిటట్రస్‌పాస్‌ కేసు నమోదు అనుమానానికి దారితీస్తోంది. విచారణ కొనసాగుతుండగానే వివాదస్ప భూమి అంశంలో గోడ నిర్మాణానికి పోలీసులే వెన్నుదన్నుగా నిలిచారని ఆరోపణలు వెలువడ్డాయి.  

కారకులెవరు... 
అమెరికాలో ఉంటున్న  అభిషేక్ కు జారీ చేసిన అక్రమ లుక్‌అవుట్‌ అని ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయని పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేంద్రహోంశాఖ విచారణకు ఆదేశిస్తే, తప్పుడు లేఖలు రాయడం, పాస్‌పోర్టు వివరాలు అనధికారికంగా సేకరించడం, నిష్పక్షపాతంగా వ్యవహారించడం వంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చదవండి: కొత్తవి ఇద్దామా.. వద్దా! బాబు పెన్షన్‌.. అర్హుల్లో టెన్షన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement