ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా? | Puffin Birds Iceland Westman Islands Interesting Facts | Sakshi
Sakshi News home page

వేసవి రాగానే ముక్కు రంగు మారే ఈ పక్షి ఏదో తెలుసా?

Sep 5 2026 11:32 AM | Updated on Sep 5 2026 11:37 AM

Puffin Birds Iceland Westman Islands Interesting Facts

కిడ్స్‌ స్పెషల్‌

ప్రాణి ప్రపంచం

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఫొటోలో ఉన్న ముద్దుముద్దు పక్షులను చూశారా? నలుపు–తెలుపు కోటు, ఎర్రటి ముక్కు, నారింజ రంగు కాళ్లతో పెంగ్విన్‌లా ఉన్నాయి కదా? వీటి పేరు పఫిన్‌. వీటిని సముద్రపు చిలుకలు అని కూడా పిలుస్తారు.

ఈ ఫోటో ఐస్‌ల్యాండ్‌ లోని వెస్ట్‌మన్నేయర్‌ దీవుల్లో తీసింది. అక్కడ ఆగస్టు నెలలో ఉష్ణోగ్రత కేవలం 12 డిగ్రీలే! అయినా పిల్లలకు అదే పెద్ద వేసవి. ఎందుకంటే అక్కడ రోజుకు 18 గంటలు సూర్యుడు ఉంటాడు. మరి ఈ పఫిన్‌లు ఎందుకు అక్కడికి వస్తాయి? గుడ్లు పెట్టడానికి. ఇవి చెట్లపై గూడు కట్టవు. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా పచ్చటి కొండ అంచున బొరియలు తవ్వి ఇల్లు చేసుకుంటాయి.

ఒక బొరియలో ఒకే ఒక్క గుడ్డు పెడుతుంది. ఈ పక్షులకు ఒక సూపర్‌ పవర్‌ ఉంది. ఒకేసారి 10 చేపలను ముక్కుతో పట్టుకోగలదు. పిల్లల కోసం అలా చేపలు తెస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు, 60 మీటర్ల లోతు వరకు నీటిలో దూకి ఈదగలదు. ఈ సందడి ఆగస్టు చివరి వరకే. సెప్టెంబర్‌ రాగానే ఇవన్నీ మళ్ళీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. మళ్ళీ వచ్చే ఏప్రిల్‌ వరకు కనిపించవు. అందుకే ఈ ఫొటో చాలా స్పెషల్‌. మీకు తెలుసా? పఫిన్‌ ముక్కు వేసవిలో మాత్రమే ఎర్రగా మారుతుంది. చలికాలం వస్తే మళ్ళీ బూడిద రంగులోకి మారిపోతుంది.

  • నిర్వహణ: కె

ఇవి కూడా చదవండి: మన కుల్ఫీ ముందు ప్రపంచ డెసర్ట్‌లు సైతం ఫిదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement