5 నిమిషాల్లో అమ్ముడైన దీపావళి రైలు టిక్కెట్లు | Diwali Train Tickets Sold Out Within Minutes | Sakshi
Sakshi News home page

5 నిమిషాల్లో అమ్ముడైన దీపావళి రైలు టిక్కెట్లు

Sep 7 2026 11:09 AM | Updated on Sep 7 2026 11:18 AM

Diwali Train Tickets Sold Out Within Minutes

దీపావళి పండుగను నవంబర్‌ 8వ తేదీన జరుపుకుంటారు. ఈ సందర్భంగా, నవంబర్‌  5వ తేదీన తమ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం రైళ్లుకు ఆదివారం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున బుకింగ్‌ కోసం రైల్వే స్టేషన్ల వద్ద భారీగా జనం గుమిగూడారు. 

ఉదయం 8 గంటలకు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లోని 2వ తరగతి స్లీపర్‌ కంపార్ట్‌మెంట్‌ కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో 33 మంది ఉన్నారు. ఏసీ క్లాసులలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి.గురువాయూర్‌ రైలు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. తూత్తుకుడి ఎక్స్‌ప్రెస్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ కూడా క్లియర్‌ చేయబడింది.

అనంతపురి, నెల్లై, పుదుచ్చేరి వెళ్లే రైళ్లలో కూడా వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నాయి. నెల్లై, నాగర్‌కోయిల్‌కు వెళ్లే వందే భారత్‌ రైళ్ల బుకింగ్‌లు కూడా ముగిశాయి. పర్యాటకులకు అత్యంత రద్దీగా ఉండే రోజులు దీపావళి. ఈక్రమంలో దీపావళి టిక్కెట్‌లను మొబైల్‌ ఫోన్‌లో కూడా అధికసంఖ్యలో బుకింగ్‌ చేసుకోవటం తో 5 నిమిషాల్లో హాట్‌ కేక్‌ లా అమ్ముడైపోయాయి. నవంబర్‌  6వ తేదీ వెళ్లే వారు సోమవారం బుక్‌ చేసుకోవాలని ప్రారంభమవుతాయి, నవంబర్‌ 7వ తేదీకి బుకింగ్‌లు మరుసటి రోజు ప్రారంభమవుతాయని రైల్వేఅధికారులు వెల్లడించారు.  

-తమిళనాడు 

చదవండి: మిమ్మల్ని క్షమించేది లేదు


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement