source: X
నమీబియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆటగాళ్లు లుహాన్ డ్రి ప్రిటోరియస్, ఆండిలే సిమెలేన్ గాయాల కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో క్రికెట్ సౌతాఫ్రికా వీరికి ప్రత్యామ్నాయాలను ప్రకటించింది.
ప్రిటోరియస్ స్థానంలో కార్బిన్ బోష్, సిమెలేన్ స్థానంలో మ్యాథ్యూ బ్రీట్జ్‌కే జట్టులోకి వచ్చారు. నమీబియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 9 నుంచి విండ్‌హోక్‌లో (నమీబియా) ప్రారంభం కానుంది.
చిచ్చరపిడుగు ఔట్
నమీబియా సిరీస్‌కు ప్రిటోరియస్ లాంటి చిచ్చరపిడుగు దూరం కావడం సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. తాజాగా నమీబియాలోనే జరిగిన టీ20 ట్రై-సిరీస్‌లో అతను అద్భుతంగా రాణించాడు. 179.37 స్ట్రైక్‌రేట్‌తో 226 పరుగులు చేసి టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. నమీబియాపై అతడు ఓ సెంచరీ కూడా సాధించాడు.
కాగా, రెగ్యులర్ కెప్టెన్లు ఎయిడెన్ మార్క్రమ్, టెంబా బవుమా నమీబియా సిరీస్‌కు అందుబాటులో లేకపోవడంతో బ్జోర్న్ ఫోర్టుయిన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
సిరీస్ షెడ్యూల్
సెప్టెంబర్ 9: తొలి వన్డే
సెప్టెంబర్ 11: రెండో వన్డే
సెప్టెంబర్ 13: మూడో వన్డే
చదవండి: ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా


