జోహన్నెస్‌బర్గ్, సౌత్‌ఆఫ్రికా: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్‌రెడ్డి పెట్లూరు ఆధ్వర్యంలో ఈడెన్వేల్‌లోని ‘ది లిటిల్ ఈడెన్’లో కార్యక్రమం జరిగింది. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి సంక్షేమం, సహాయార్థం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు. సేవా భావం, మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించి, స్వయంగా పాల్గొని విజయవంతం చేసిన నరసింహరెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్‌రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి ఏనుముల, హరీష్ గోరంట్ల, శ్రావణి పెట్లూరు, కరుణా బసిరెడ్డి, సుమన్ చిట్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు.


