వైఎస్సార్‌కు ఘన నివాళి | YS Jagan Pays Tribute To Dr YS Rajasekhara Reddy at Idupulapaya | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌కు ఘన నివాళి

Sep 3 2026 4:33 AM | Updated on Sep 3 2026 4:33 AM

YS Jagan Pays Tribute To Dr YS Rajasekhara Reddy at Idupulapaya

ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఇడుపులపాయలో ఘనంగా వైఎస్సార్‌ 17వ వర్ధంతి

నివాళులర్పించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన 

వైఎస్‌ జగన్, తల్లి విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి 

వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు 

కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు 

మహానేతను స్మరించుకున్న వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు

సాక్షి, కడప: సంక్షేమ ప్రదాతగా, అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. తన మాతృమూర్తి, వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌.. తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం, పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. కొద్దిసేపు మౌనంగా కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. ఘాట్‌ 
ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూల­మాలలు వేసి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం తల్లి వైఎస్‌ విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ చిన్నాన్న వైఎస్‌ సుధీకర్‌రెడ్డి, సోదరుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, చిన్నమ్మ వైఎస్‌ ప్రమీలమ్మ, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డాక్టర్‌ మధుసూదన్, వైఎస్సార్‌సీపీ వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్వీ సతీష్‌కుమార్‌ రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ  డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామి­రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, తోపుదుర్తి ప్రకాశ్‌­రెడ్డి, అత్తార్‌ చాంద్‌బాషా, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, సీఈసీ సభ్యుడు కె.సురేష్‌బాబు, జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ రామ­గోవిందరెడ్డి, పులివెందుల పరిశీలకులు పూల శ్రీనివాసరెడ్డి, కమలాపురం, కదిరి ఇన్‌ఛార్జిలు నరేన్‌ రామాంజులరెడ్డి, మగ్బూల్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రా­జోలి వీరారెడ్డి, నిత్యానందరెడ్డి, సొహైల్‌ అహ్మద్, గోసుల శివభరత్‌రెడ్డి, జిల్లా క్రికెట్‌ అసో­సియేషన్‌ అధ్యక్షుడు భరత్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌­సీపీ నేతలు, అభిమానులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎస్‌ఐ పాస్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ డాక్టర్‌ డి.థామస్‌ బెన్‌హర్, పాస్టర్లు మత్యుంజయ, నరేష్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. 

ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు.

అభిమానులతో పోటెత్తిన వైఎస్సార్‌ ఘాట్‌
ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన వైఎస్సార్‌ అభిమా­నులతో వైఎస్సార్‌ ఘాట్‌ పోటెత్తింది. పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని పూలమాలలు, పుష్పగుచ్ఛాలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను చూడగానే అభిమాను­లు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్‌ అమర్‌ ­రహే అంటూ చేసిన నినాదాలతో ఘాట్‌ ప్రాంగణం మా­ర్మోగింది. ప్రార్థనలకు వచ్చే సమయంలో, తి­రిగి వెళ్లే సమయంలో వైఎస్‌ జగన్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆప్యాయంగా పలక­రించారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ, కరచా­లనం చేస్తూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement