● మహా నివాళి | - | Sakshi
Sakshi News home page

● మహా నివాళి

Sep 3 2026 4:21 AM | Updated on Sep 3 2026 4:21 AM

ఇడుపులపాయలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటిస్తున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, చిత్రంలో పార్టీ నేతలు కొరముట్ల, చెవిరెడ్డి తదితరులు

సాక్షి, కడప : మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. కొద్దిసేపు మౌనంగా కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. ఘాట్‌ ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అభిమానులతో పోటెత్తిన ఇడుపులపాయ

ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన వైఎస్సార్‌ అభిమానులతో జనసంద్రమైంది. కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో అభిమానులు, పార్టీ నేతలతో కరచాలనం చేస్తూ కదిలారు. ఆప్యాయంగా పలుకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement