గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డుపై లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డుపై లారీ బోల్తా

Sep 3 2026 4:21 AM | Updated on Sep 3 2026 4:21 AM

చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డుపై బుధవారం ఉదయం టెంకాయల లోడుతో వెళుతున్న లారీ వెనుక టైరు పంక్చరు కావడంతో బోల్తా పడింది. తమిళనాడు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న టీఎన్‌ 52 ఎల్‌ 5973 నెంబరు గల పన్నెండు టైర్ల లారీ ఘాట్‌ రోడ్డుపై కడప వైపున మొదటి మలుపులో టైరు పంక్చరై నెమ్మదిగా వస్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదం నుండి వాహనంలోని డ్రైవర్‌ సురక్షితంగా బయటపడగా, టెంకాయలు రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుపై కాసేపు ట్రాఫిక్‌ సమస్య తలెత్తగా పోలీసులు స్పందించి రెండు క్రేన్లతో లారీని యధాతథ స్థితిలోకి తెచ్చి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement