విద్యుత్ లైన్లపై స్టెరిలైట్ సంస్థకు పంపిన అభ్యంతరాల పోస్టులు బోగస్ అడ్రస్ వల్ల వెనక్కి వచ్చాయి. నష్టం లేని ప్రత్యామ్నాయ మార్గాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మా అనుమతి లేకుండా రెజోనియా సంస్థ క్షేత్రస్థాయిలో పనులు చేయడం దుర్మార్గం.
– రాజుల మల్లారెడ్డి, రైతు, లింగారెడ్డిపల్లె.
మాకున్న కొద్దిపాటి భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బలవంతంగా పనులు మొదలుపెడితే రైతులంతా మూకుమ్మడిగా ప్రతిఘటిస్తాం. కమ్మవారిపల్లె చెరువు నుండి నేరుగా పవర్ గ్రిడ్‌కు ప్రత్యామ్నాయ మార్గం ఉన్నా మా భూముల్లోనే లైన్లు వేయడం అన్యాయం.
– యుగంధర్, రైతు, కొలుములపల్లె.


