మన చావును ఇలా తెలుసుకోవచ్చట.. షాకిస్తున్న జపాన్ అధ్యయనం! | Study Reveals People Who Expect To Live Longer May Actually Have Longer Lifespans, Read Story Inside | Sakshi
Sakshi News home page

మన చావును ఇలా తెలుసుకోవచ్చట.. షాకిస్తున్న జపాన్ అధ్యయనం!

Sep 3 2026 8:35 AM | Updated on Sep 3 2026 10:50 AM

Humans Can Accurately Predict Their Lifespan Japan Study Finds

మనుషులు తాము ఎంతకాలం జీవిస్తామనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేయగలరని జపాన్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ కాలం జీవిస్తామని భావించే వ్యక్తులు అనుకున్నట్లే ఎక్కువ కాలం జీవించే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో, తాము ఎక్కువ కాలం బతకలేమని భావించిన వారిలో సుమారు 59 శాతం మంది తమ అంచనా కంటే ఎక్కువ ఏళ్లే జీవించినట్లు తేలింది.

సుకూబా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త షోహీ ఒకమోటో నేతృత్వంలోని బృందం ‘జపనీస్ ఏజింగ్ అండ్ హెల్త్ డైనమిక్స్ స్టడీ’ డేటాను విశ్లేషించింది. 60 ఏళ్లు, ఆపై వయసున్న 2,447 మంది వృద్ధులను వారు ఎంత వయసు వరకు జీవిస్తారని అడగ్గా, 393 మంది సమాధానం చెప్పలేకపోయారు. మిగిలిన వారు 63 నుంచి 120 ఏళ్ల మధ్య వయసును అంచనాగా పేర్కొన్నారు.

28 ఏళ్ల అనంతరం, అంటే 2024 నాటికి ఈ వ్యవధిలో మరణించిన 1,514 మంది అంచనాలను, వారి వాస్తవ ఆయుష్షుతో శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. ఎక్కువ కాలం జీవిస్తామని భావించిన వారు తమ జీవితంలో మరిన్ని ఏళ్లను పొడిగించుకున్నట్లు స్పష్టమైంది. అయితే కేవలం సానుకూల దృక్పథం వల్లే ఇది సాధ్యమైందా అన్న అంశాన్ని శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు. ఇది కేవలం పరిశీలనాత్మక డేటా మాత్రమేనని స్పష్టం చేశారు.

సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది తమ ఆయుష్షును 80 ఏళ్లుగా పేర్కొన్నారు. 1996 నాటి జపాన్ సగటు ఆయుర్దాయం కూడా దీనికి సమీపంలోనే ఉండటంతో, ప్రజలు ఆ సంఖ్యను ఎంచుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, కుటుంబ నేపథ్యం ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తామని విశ్వసించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, ఉన్నత విద్యావంతులు తమ అంచనాలను మించి జీవించినట్లు తేలింది.

ఇది కూడా చదవండి: భార్య గుట్టు రట్టు చేసిన రోబో వాక్యూమ్.. భర్తకు తప్పని జైలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement