ఆపిల్‌ మ్యాప్స్‌లో మారిన లేక్‌ ఆంటారియో పేరు | Apple Maps renames Lake Ontario as Lake America | Sakshi
Sakshi News home page

ఆపిల్‌ మ్యాప్స్‌లో మారిన లేక్‌ ఆంటారియో పేరు

Sep 3 2026 6:08 AM | Updated on Sep 3 2026 6:08 AM

Apple Maps renames Lake Ontario as Lake America

షికాగో: అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్‌’ వెంటనే అమలుచేసింది. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న సరస్సు ‘లేక్‌ ఆంటారియో’పేరును ఇటీవల ట్రంప్‌ ‘లేక్‌ అమెరికా’గా మార్చిన విషయం తెల్సిందే. ఈ మేరకు యాపిల్‌ తన ‘మ్యాప్స్‌’ యాప్‌లోనూ కొత్త పేరుకు తగ్గట్లు మార్పులు చేసింది. 

ఇకపై అమెరికాలోని యాపిల్‌ సంస్థ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌లలో లేక్‌ ఆంటారియోను వెతికితే ‘లేక్‌ అమెరికా’ అని మాత్రమే చూపిస్తుంది. ఇతర దేశాల్లోని యూజర్లకు మాత్రం పాత పేరు కన్పించేలా సెట్టింగ్‌లను మార్చేసింది. కెనడాతో అమెరికా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదరకపోవడంతో కోపంతో ట్రంప్‌ ఈ పేర్ల మార్పు ప్రక్రియ చేపట్టడం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement