అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. యూఏఈ విమాన సర్వీసులపై భారీ ప్రభావం | Emirates, Etihad, flydubai, Air Arabia cancellations as Iran tensions escalate | Sakshi
Sakshi News home page

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. యూఏఈ విమాన సర్వీసులపై భారీ ప్రభావం

Sep 2 2026 11:00 PM | Updated on Sep 2 2026 11:00 PM

Emirates, Etihad, flydubai, Air Arabia cancellations as Iran tensions escalate

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యూఏఈ నుంచి నడిచే విమాన సర్వీసులపై భారీ ప్రభావం చూపుతున్నాయి. Emirates, Etihad Airways, flydubai, Air Arabia వంటి ప్రాంతీయ విమానయాన సంస్థలు కొన్ని కీలక సర్వీసులను కొనసాగిస్తున్నప్పటికీ, పలు మార్గాల్లో విమానాలు రద్దు, ఆలస్యం లేదా దారి మళ్లింపులకు గురవుతున్నాయి.

సెప్టెంబర్ 1న అమెరికా బలగాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై దాడులు చేయగా, అనంతరం ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలోని గగనతల పరిస్థితులు మరింత అనిశ్చితంగా మారాయి.

నిలిచిపోయిన అంతర్జాతీయ సర్వీసులు
Air Canada, British Airways, Cathay Pacific, Singapore Airlines, ITA Airways, Finnair, Philippine Airlines, AirBaltic, Korean Air, Pegasus, Virgin Atlantic, Lufthansa, Eurowings, SWISS తదితర అంతర్జాతీయ సంస్థలు దుబాయ్ లేదా అబుదాబికి సంబంధించిన కొన్ని సర్వీసులను వివిధ తేదీల వరకు నిలిపివేశాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో విమానం బుక్ అయినా, విమానాశ్రయానికి బయలుదేరే ముందు తప్పనిసరిగా విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని యూఏఈ విమానాయాన సంస్థలు ప్రయాణికులకు సూచిస్తున్నాయి.

చదవండి: "ట్రంప్ స్ట్రయిట్‌"గా మార్చాలా..? అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement