"ట్రంప్ స్ట్రయిట్‌"గా మార్చాలా..? అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు | Trump suggests renaming the Strait of Hormuz after himself | Sakshi
Sakshi News home page

"ట్రంప్ స్ట్రయిట్‌"గా మార్చాలా..? అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Sep 2 2026 10:36 PM | Updated on Sep 2 2026 10:45 PM

Trump suggests renaming the Strait of Hormuz after himself

source: X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతకొంతకాలంగా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్ట్రయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ను తన పేరుతో "ట్రంప్ స్ట్రయిట్‌"గా మార్చాలా..? అని ట్రూత్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు. అమెరికా మాదిరిగానే ఇది కూడా గతంలో కంటే మరింత 'హాట్‌'గా ఉంటుందని వ్యాఖ్యానించాడు.

ఇటీవల కెనడాతో వివాదం కొనసాగుతున్న సమయంలో లేక్ ఒంటారియో పేరును 'లేక్ అమెరికా'గా మార్చేందుకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. అంతకుముందు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చుతున్నట్లు కూడా ప్రకటించాడు. 

ఈ పేర్ల మార్పులను సంబంధిత దేశాలు వ్యతిరేకించాయి. ఒకవేళ హర్మూజ్‌ను ట్రంప్‌ తన పేరుతో మార్చాలని ప్రయత్నించినా, అదే జరిగే అవకాశం​ ఉంది.

కాగా, ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో స్ట్రయిట్‌ ఆఫ్‌ హర్మూజ్‌పై అమెరికా నియంత్రణ ఉందని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. అయితే ఈ నియంత్రణపై ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

హర్మూజ్‌ ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటి. పెర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తో కలిపే ఈ జలమార్గం ద్వారా భారీగా చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది.

అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధానికి ముందు ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు ఐదో వంతు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యేది. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి.

చదవండి: ‘ట్రంపిజం’ ప్రపంచాన్ని ఎలా మారుస్తోంది? మనపై ప్రభావం ఇలా..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement