వాషింగ్టన్: అమెరికా 250వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టంకశాల ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖం కనిపించే ఈ ఒక డాలర్ నాణెం విక్రయానికి సిద్ధంగా ఉందని యూఎస్ మింట్ ప్రకటించింది. నాణెంపై ఒక వైపు ట్రంప్ ముఖచిత్రం, లిబర్టీ, 1776 అని ముద్రించారు. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక ముద్ర ఉండేలా డిజైన్ చేశారు. దీనికి ఈ ఏడాది యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆమోదం తెలియజేసింది.
ఈ కమిషన్ సభ్యులను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నియమించారు. నాణెంపై తన ముఖచిత్రాన్ని ముద్రించాలనే ఆలోచన చాలా అసాధారణమైనదని, ఇది గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని అమెరికా కరెన్సీపై ముద్రించడాన్ని నిషేధించే సమాఖ్య చట్టం అమల్లో ఉంది. కానీ, కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేక నాణేలను ముద్రించడానికి, జారీ చేయడానికి ట్రెజరీ సెక్రటరీకి అధికారం ఉంటుంది. 25 నాణేలున్న ఒక రోల్ ధర 61 అమెరికన్ డాలర్లు, అలాగే 100 నాణేలున్న ఒక బ్యాగ్ ధర 154.50 అమెరికన్ డాలర్లు ఉంటుంది. ..


