8వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్‌ | Zimbabwes Brad Evans Creates History | Sakshi
Sakshi News home page

8వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్‌

Sep 7 2026 12:36 PM | Updated on Sep 7 2026 12:57 PM

Zimbabwes Brad Evans Creates History

Credit: Cricket Namibia

న‌మీబియా వేదిక‌గా జ‌రిగిన ముక్కోణపు టీ20 సిరీస్ విజేత‌గా సౌతాఫ్రికా నిలిచింది. ఆదివారం విండ్‌హోక్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో జింబాబ్వేను 48 ప‌రుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. 206 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌లేక జింబాబ్వే చ‌తిక‌ల ప‌డింది.

జింబాబ్వే ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ ఒంటరి పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్ష్య చేధనలో 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి రజా సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎవాన్స్‌.. సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 

మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఎవాన్స్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 సిరీస్ / ఓ టోర్నమెంట్ ఫైనల్‌లో 6వ స్ధానం లేదా ఆ తర్వాత స్ధానంలో బ్యాటింగ్‌కు దిగి అర్ధసెంచరీ చేసిన తొలి ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ ప్లేయర్‌గా ఎవాన్స్ నిలిచాడు.

ఇప్పటివరకు ఐసీసీ టెస్టు హోదా ఉన్న ఏ జట్టు ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్‌గా అయితే 6వ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు అత్యధిక స్కోర్ చేసిన రికార్డు నేపాల్‌కు చెందిన బసీర్ అహ్మద్ పేరిట ఉంది. క్వాడ్రాంగులర్ టీ20 సిరీస్ ఫైనల్లో కువైట్‌పై నేపాల్ తరఫున అతడు 80 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement