భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 విజేతగా నిలిచి ఏడాది అవుతున్నప్పటికీ, ట్రోఫీ ఇంకా వారి చేతికి అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆ ట్రోఫీని అందుకోకపోవడంతో.. అది ఇప్పటికీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయింది.
అయితే ఇప్పుడు భారత మహిళల జట్టుకు అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న మహిళల ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా నఖ్వీ హాజరుకానున్నట్లు సమాచారం. గతంలో జరిగినట్లుగానే విజేతలకు ట్రోఫీని స్వయంగా అందించాలని నఖ్వీ భావిస్తున్నారు.
ప్రస్తుత భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే మరోసారి ఆసియా విజేతగా నిలిచేందుకు ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే నఖ్వీ చేతుల మీదగా భారత అమ్మాయిల జట్టు ట్రోఫీ తీసుకుంటుందా లేదా? మెన్స్ టీమ్ మాదిరిగానే బాయ్‌కట్ చేస్తుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికి ఆసియాకప్‌లో మరోసారి హైడ్రామా చోటు చేసుకోవడం ఖాయమన్పిస్తోంది.
కాగా ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. టీమిండియా ఇప్పటికే తమ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్ షేక్ చేసుకోలేదు. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరినా ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.
చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్‌ప్లాప్ ప్లేయర్‌కు చోటు


