breaking news
Mohsin Naqvi
-
ఆసియాకప్ ట్రోఫీ ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే! నఖ్వీ పోస్ట్ ఊస్టింగ్?
2025 ఆసియా కప్.. ఈ ఖండాతర టోర్నీ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఎడిషన్‌గా నిలిచింది. షేక్ హ్యాండ్ వివాదం మొదలు ఆసియా కప్ ట్రోఫీ వరకూ ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠను రేపింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టే వ్యవహరించింది. తొలుత షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి నిరాకరించిన భారత్.. ఆ తర్వాత ఏసీసీ చైర్మెన్, పీసీబీ చీఫ్ మోహ్సన్ నఖ్వీ(mohsin naqvi) చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి సముఖత చూపలేదు. నక్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని పట్టుబట్టినప్పటికి బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ అందుకు అంగీకరించలేదు.దీంతో నఖ్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విజేతల పతకాలను కూడా తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పటికి ఇంకా ట్రోఫీని భారత్‌కు అతడు అందజేయలేదు. ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీస్‌లో ఉంది. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని ఏసీసీ అధికారులకు నఖ్వీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం, ఇంకా అందజేయకపోవడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తునుంది. అంతేకాకుండా ఐసీసీ డైరెక్టర్ పదవి నుండి అతడిని తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది.నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు ఐసీసీ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నాడు. కాగా ఐసీసీ చైర్మెన్‌గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నఖ్వీ డైరక్టర్ పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం సాగుతోంది."ఆసియాకప్ టోర్నీకి అధికారిక హోస్ట్‌గా ఉన్న బీసీసీఐకి ట్రోఫీని పంపడానికి నిరాకరించే హక్కు నఖ్వీకి లేదు. అతడు ట్రోఫీని భారత్‌కు ఇప్పటికే పంపించాల్సింది. కానీ అందుకు అతడు ఒప్పుకోవడం లేదు. కాబట్టి అందుకు నఖ్వీ భారీ మూల్యం చెల్లించుకోనున్నాడు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: ఐపీఎల్లో అదరగొట్టాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఊహించని జాక్ పాట్ -
ఇంకెంతకు దిగజారుతావు?.. నఖ్వీ ఓవరాక్షన్ మామూలుగా లేదు
ఆసియాకప్-2025 ట్రోఫీ వివాదానికి ఇప్పటిలో ఎండ్‌కార్డ్ పడేలా లేదు. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరిగి దాదాపు వారాలు అవుతున్నప్పటికి ట్రోఫీ ఇంకా టీమిండియా చేతికి రాలేదు. ఈ ట్రోఫీ విషయంలో ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెనక్కి తగ్గడం లేదు.ఇప్పటికే తన చేతుల మీదగానే ట్రోఫీ ప్రధానం చేయాలని మొండిపట్టుతో ఉన్నాడంట. కాగా ఆసియాకప్ ఫైనల్లో విజయం తర్వాత విన్నింగ్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత్ ఇష్టపడలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. ఏసీసీ చైర్మెన్ ఎవరంటే వారే ట్రోఫీని విజేతకు అందించాలి.కానీ నఖ్వీ ఏసీసీ చీఫ్‌తో పాటు పీసీబీ చైర్మెన్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరిచింది. అతడికి బదులుగా యూఏఈ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్‌ల చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని భారత్ తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ ఒప్పుకోలేదు. తీసుకుంటే తన నుంచే తీసుకోవాలని పట్టుబట్టాడు. టీమిండియా ప్లేయర్లు కూడా వెనక్కి తగ్గకుండా గ్రౌండ్‌లోనే కూర్చోవడం పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. దీంతో ఘోర అవమానంగా భావించిన నఖ్వీ.. స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విన్నర్స్ మెడల్స్‌ను తీసుకువెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. అయితే ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు నఖ్వీ అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు. ట్రోఫీ ఇంకా నఖ్వీ వద్దే ఉంది."ప్రస్తుతం ఆసియాకప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. అక్కడి అధికారులకు మొహ్సిన్ నఖ్వీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని అతడు సూచించాడు. ఎప్పుడైనా కానీ భారత జట్టుకు లేదా బీసీసీఐకి ట్రోఫీ తనే అందజేస్తానని ఏసీసీ అధికారులకు నఖ్వీ చెప్పినట్లు" పీసీబీ చీఫ్ సన్నిహితుడు ఒకరు పిటిఐకు తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న సమావేశాల్లో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్‌కు సారీ చెప్పిన పృథ్వీ షా -
ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు
ఆసియాకప్-2025 ఫైనల్ మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన భారత జట్టు ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరకారించింది.టీమిండియా చర్యతో మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవమానం ఎదురైంది. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్‌కు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఇప్పటికీ ఇంకా ట్రోఫీ భారత్ వద్దకు చేరలేదు. అతడు ఆసియాకప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదేవిధంగా ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం కూడా చేయలేదు. ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన భారత జట్టు వైఖరిని డివిలియర్స్ తప్పు బట్టాడు. క్రీడలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని అతడు కోరాడు."ఆసియాకప్ ట్రోఫీని ఏసీసీ చైర్మెన్ చేతుల మీదగా తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. అందుకు కారణం మనందరికి తెలుసు. కానీ నావరకు అయితే అది క్రీడలకు సంబంధించినది కాదు. క్రీడల నుంచి రాజకీయాలను పక్కన పెట్టాలి.స్పోర్ట్స్‌ను మనం ప్రత్యేకంగా చూడాలి. పాలిటిక్స్‌తో ముడిపెట్టకూడదు. ఆసియాకప్‌లో చోటు చేసుకున్న పరిణామాలు నాకు చాలా బాధ కల్గించాయి. అయితే భవిష్యత్తులో ఈ సమస్యలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు క్రీడాకారులను మానసికంగా దెబ్బతీస్తాయి. నాకు ఇటువంటివి అస్సలు నచ్చవు. చివరికి వివాదాలతోనే ఆసియాకప్ ముగిసింది" అని ఏబీడీ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.అదేవిధంగా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టు ఈ సౌతాఫ్రికా లెజెండ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా చాలా పట్టిష్టంగా కన్పిస్తోందని, టీ20 ప్రపంచకప్-2026కు సిద్దంగా ఉందని అతడు కొనియాడాడు.చదవండి: IND vs WI: టీమిండియాతో మ్యాచ్.. చందర్‌పాల్ తనయుడు అట్టర్ ప్లాప్ -
దిగొచ్చిన పీసీబీ చైర్మెన్ నఖ్వీ.. ఆసియా కప్ ట్రోఫీ అందజేత?
ఆసియా కప్-2025 ట్రోఫీ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డు దెబ్బకు దిగొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జీ న్యూస్ కథనం ప్రకారం.. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అయితే ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ నేరుగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.కానీ ఇప్పుడు నఖ్వీ వెనక్కి తగ్గి ట్రోఫీ యూఏఈ క్రికెట్ బోర్డు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయంపై బీసీసీఐ గానీ, యూఏఈ క్రికెట్ బోర్డు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ యూఏఈ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.అసలేంటి ఈ ట్రోఫీ వివాదం..?ఆసియాకప్ విజేతగా నిలిచిన అనంతరం ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి భారత్ నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు పీసీబీ ఛీప్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడమే ఇందుకు కారణం.అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్, యూఏఈ క్రికెట్ బోర్డు చైర్మెన్ చేతులు మీదగా ట్రోఫీని తీసుకుంటామని టీమిండియా తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ అంగీకరించలేదు. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు.అప్పటి నుంచి ఆసియాకప్ ట్రోఫీ అతడి వద్దే ఉంది. కాగా ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేయడానికి నిరకారించారు. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs AUS: ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్‌కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్‌కు నఖ్వీ షరతు
ఆసియా కప్ (Asia cup 2025) ట్రోఫీ విషయంలో ఏసీసీ (Asia Cricket Council) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) మొండిపట్టు వీడటం లేదు. తన వద్ద ఉంచుకున్న ట్రోఫీని నిర్వహకులకు ఇచ్చేయాలని నిన్న (సెప్టెంబర్ 30) జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాథ్యక్షుడు రాజీవ్ శుక్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. పైగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు (Surya Kumar Yadav) కొత్త షరతు పెట్టాడు.ట్రోఫీ కావాలంటే స్వయంగా నా ఆఫీస్‌కు వచ్చి తీసుకోవాలని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. నఖ్వీ వాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నఖ్వీ ఓవరాక్షన్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నఖ్వీ విషయంలో బీసీసీఐ, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. తక్షణమే అతన్ని ఏసీసీ అధ్యక్ష హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరస్కరించాడు. ఇందుకు ప్రతిగా నఖ్వీ భారత ఆటగాళ్లకు అందించాల్సిన మెడల్స్‌ను, ట్రోఫీని ఎత్తుకెళ్లిపోయాడు. నఖ్వీ ట్రోఫీ ఇవ్వకపోయినా భారత ఆటగాళ్లు కృత్రిమంగా ట్రోఫీని అందుకున్నట్లు సంబురాలు చేసుకున్నారు. దీనిపై నిన్న జరిగిన ఏసీసీ సర్వసభ్య సమావేశం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అయినా నఖ్వీ మొండిపట్టు వీడలేదు. ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని దాటవేశాడు. నఖ్వీ ప్రవర్తనపై యావత్ భారతావణి మండిపడుతుంది. వీడి వేశాలేంట్రా బాబు అని అనుకుంటుంది. ట్రోఫీ తీసుకున్నా, తీసుకోకపోయినా విజేతలం మనమే అని సర్దుకుపోతుంది.చదవండి: అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా.. -
ట్రోఫీ, మెడల్స్ ని ఎత్తుకెళ్లిన మొహసిన్ నఖ్వీ..
-
అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్‌గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్‌గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్‌గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్‌ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు... ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్‌కాస్ట్‌లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్‌లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్‌కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం! -
ప్రదానం చేయలేదని.. ఎప్పటికీ పంపరా?
దుబాయ్: ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడి వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మండిపడింది. మంగళవారం ఇక్కడ ఏసీసీ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది. ఇందులో భారత బోర్డు తరఫున సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ కోశాధికారి ఆశిష్ షెలార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు కూడా అయిన ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ విపరీత ధోరణిపై బీసీసీఐ ప్రతినిధులిద్దరు ఆక్షేపించారు. నఖ్వీ పాక్ ప్రభుత్వంలో మంత్రి కూడా కావడంతో టీమిండియా అతని చేతుల మీదుగా జరగాల్సిన ట్రోఫీ ప్రదానోత్సవాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఆదివారం రాత్రి తను ప్రదానం చేయలేదన్న అక్కసుతో నఖ్వీ తర్వాత కూడా విజేత భారత జట్టుకు పంపకుండా ఏసీసీ కార్యాలయంలోనే అట్టిపెట్టాడు. దీంతో ‘కప్’ లేకుండానే భారత క్రికెట్ జట్టు సభ్యులు స్వదేశానికి వచ్చారు. మంగళవారం జరిగిన ఏజీఎంలో నఖ్వీ కొనసాగిస్తున్న ‘ట్రోఫీ డ్రామా’పై శుక్లా, షెలార్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది ఏసీసీ ట్రోఫీ. ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. టోర్నీలో గెలిచిన విజేత జట్టుకే అప్పగించాలి’ అని రాజీవ్ శుక్లా గట్టిగానే స్పష్టం చేశారని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఏజీఎంలో ఇంత జరుగుతున్నా... భారత్ నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వెల్లువెత్తుతున్నా... ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ మాత్రం ఇంకా తన మొండి పట్టు వీడటం లేదు. ట్రోఫీని ఇచ్చేందుకు సమావేశంలో అంగీకరించలేదని తెలిసింది.ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని నఖ్వీ దాటవేశారు. ఏసీసీ ఎజెండాలోని వైస్ చైర్మన్ ఎన్నిక వరకే ఈ మీటింగ్‌ను పరిమితం చేయాలని చూశారు. అంతేకాదు. వెస్టిండీస్‌పై నేపాల్ సంచలన విజయం పట్ల నేపాల్ జట్టును అభినందించారు. నేపాల్ ఆసియా జట్టు కావొచ్చు. కానీ ఆ ద్వైపాక్షిక సిరీస్ ఏసీసీకి సంబంధించిన టోర్నీ కానేకాదు. అయినా నేపాల్‌ను ప్రశంసించిన నఖ్వీ... ఏసీసీ సొంత టోర్నీ అయిన ఆసియా కప్ గెలిచిన భారత్‌ను మాటమాత్రంగానైనా అభినందించకుండా తన కుటిల బుద్ధిని చాటుకున్నారు. మొత్తానికి ఆసియా కప్ ట్రోఫీ మాత్రం ఇంకా ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. -
కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ
ఆసియా కప్ 2025 (Asia cup 2025) హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ ముగిసి రెండు రోజులైనా ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు (Team India) విన్నింగ్ ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీద నుంచి విన్నింగ్ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను తీసుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకున్నా గెలుపు సంబురాలు అద్భుతంగా చేసుకున్నారు.తాజాగా నఖ్వీ తాను ఎత్తుకెళ్లి పోయిన ట్రోఫీని, మెడల్స్‌ను భారత ఆటగాళ్లకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు ఓ కండీషన్ పెట్టాడట. అతనే స్వయంగా భారత కెప్టెన్‌కు ట్రోఫీని, మిగతా ఆటగాళ్లకు మెడల్స్‌ను ఇస్తానని చెప్పాడట. నఖ్వీ పెట్టిన ఈ కండీషన్‌కు భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ వివాదం అతి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగబోయే ఏసీసీ సమావేశంలో బీసీసీఐ నఖ్వీని తూర్పారబెట్టాలని డిసైడైంది. ఇది అతని పదవికే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ వివాదాన్ని బీసీసీఐ ఐసీసీ వరకు కూడా తీసుకెళ్లకుండా ఏసీసీలోనే తెంచేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్‌ను ఓడించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌ను నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పీసీబీ నానా యాగీ చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.తమకు అనుకూలంగా ఏదీ జరగడం లేదని తెలిసి పీసీబీ వారి ఆటగాళ్లను రెచ్చగొట్టింది. భారత్‌ను, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ చాలా ఓవరాక్షన్ చేశారు. దీనికి కూడా పాక్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. పాక్ ఆటగాళ్ల కవ్వింపులకు ఎక్కడా సహనం కోల్పోని టీమిండియా మైదానంలో వారికి తగు రీతో బద్ది చెప్పింది.చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన -
‘మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం’
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. చాంపియన్ టీమ్‌కు ట్రోఫీ ఇవ్వకుండా నిలిపివేసిన ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అతను అన్నాడు. అయితే తాము ఈ విషయాన్ని పట్టించుకోమని, ట్రోఫీ లేకపోవడం వల్ల తమ విజయం విలువ ఏమాత్రం తగ్గదని సూర్య వ్యాఖ్యానించాడు. ‘ఒక క్రికెట్ అభిమానిగా, ఆపై ఆటగాడిగా ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎంతో కష్టపడి విజేతగా నిలిచి సంపాదించిన ట్రోఫీని ఆటగాళ్లకు ఇవ్వకపోవడం ఏమిటి? దానిని అందుకునేందుకు మాకు పూర్తి అర్హత ఉంది. అయితే ట్రోఫీల గురించే మాట్లాడాల్సి వస్తే మా డ్రెస్సింగ్‌రూమ్‌లోనే ఇలాంటి 14 ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఆసియా కప్ గెలుపు ప్రయాణంలో మా ఒక్కో ఆటగాడు, సహాయక సిబ్బంది ఒక్కో ట్రోఫీతో సమానం. పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించరాదనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు. మా జట్టు సభ్యులంతా మైదానంలో కలిసి తీసుకున్న నిర్ణయమిది’ అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. మరోవైపు పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాల సంక్షేమం కోసం తాను ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల ద్వారా అందుకున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (రూ. 28 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు. నఖ్వీ తీసుకెళ్లిపోయాడు! ఫైనల్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదానోత్సవానికి వేదికను ఏర్పాటు చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాకిస్తాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన మొహసిన్ నఖ్వీ అక్కడే ఉన్నాడు. అయితే పహల్గాం దాడి సమయంలో నఖ్వీ సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని భారత జట్టు ముందే ఏసీసీకి సమాచారం అందించింది. దాంతో ప్రత్యామ్నాయంగా వేదికపై ఉన్న ఇతర అధికారుల నుంచి అందించవచ్చని నిర్వాహకులు భావించారు. అయితే నఖ్వీ వేదికపై ఉన్నంత సేపు తాము అక్కడికి వెళ్లమని భారత్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఏసీసీ అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీ ఇస్తానంటూ నఖ్వీ మొండితనం ప్రదర్శించాడు. దాంతో చివరకు భారత్ కప్ అందుకోకుండానే కార్యక్రమం ముగిసింది. అయితే ఆశ్చర్యకరంగా, ఎవరూ ఊహించని విధంగా నఖ్వీ సన్నిహితులు కొందరు అక్కడ ఉన్న ఆసియా కప్ ట్రోఫీని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. అనంతరం భారత జట్టు మొత్తం వేదిక వద్ద చేరి ఊహాత్మకంగా ట్రోఫీ చేతిలో ఉన్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకుంది. బీసీసీఐ ఆగ్రహం... నఖ్వీ ప్రవర్తనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నఖ్వీ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఆయన నుంచి ట్రోఫీ తీసుకోవద్దని భారత్ నిర్ణయించింది. కానీ ఆయన తనతో పాటు ట్రోఫీని, పతకాలను కూడా తీసుకెళ్లమని దానర్థం కాదు. అవన్నీ వీలైనంత త్వరగా భారత్‌కు వస్తాయని నమ్ముతున్నాం. నవంబరులో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడి ప్రవర్తనపై మేం చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేయనున్నాం’ అని సైకియా వెల్లడించారు. మరోవైపు టోర్నీలో భారత జట్టు ప్రవర్తన క్రికెట్‌ను అగౌరవపర్చినట్లుగా ఉందని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు వేర్వేరు సందర్భాల్లో తనతో కరచాలనం చేసిన సూర్యకుమార్... జనం మధ్యలోకి వచ్చేసరికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సల్మాన్ విమర్శించాడు. తిలక్ వర్మకు ఘన స్వాగతం... అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి నగరానికి తిరిగొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి అభిమానులు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘నేను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అయితే నా బ్యాట్‌తోనే వారికి సమాధానం చెప్పాలని భావించా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో వారెవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా’ అని తిలక్ మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. -
ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్
ఆసియాకప్-2025 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచిన అనంతరం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్‌మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.ప్రోటోకాల్ ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాస్ అయిన మొహ్సిన్ నఖ్వీనే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ట్రోఫీని అతడి నుంచి తీసుకోవాడనికి మెన్ ఇన్ బ్లూ సముఖత చూపలేదు.దీంతో దాదాపు గంట అలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కేవలం పాక్ ఆటగాళ్లే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. అయితే భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని తెలియజేసింది. అందుకు వారిద్దరూ అంగీకరించారు. కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తానే అందిస్తానని మొండిపట్టు పట్టాడు. దీంతో టీమిండియా పూర్తిగా ట్రోఫీనే తీసుకోమని తేల్చి చెప్పేసింది. భారత్ తీరుతో సహనం కోల్పోయిన పీసీబీ చీఫ్.. ఆసియా కప్ ట్రోఫీతో పాటు, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను హోటల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఈ క్రమంలో నఖ్వీ వ్యవహరించిన తీరు పట్ల సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చర్యను భారత క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సైకియా తెలిపారు.బీసీసీఐ సీరియస్.."భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. పాకిస్తాన్ సీనియర్ లీడర్స్‌లో ఒకరిగా ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు. అటువంటి అప్పుడు అతడి చేతుల మీదగా ట్రోఫీని ఎలా తీసుకుంటాము? అతడి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాము. అతడు చేతుల మీదగా తీసుకోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. ట్రోఫీని, పతకాలను హోటల్ గదికి తీసుకువెళ్లే హక్కు ఎవరు ఇచ్చారు? నఖ్వీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. అతడికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఈ విషయంపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భారత్‌కు పంపిస్తారని ఆశిస్తున్నా" అని ఎఎన్ఐతో సైకియా పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్
ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తొమ్మిదో సారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.భారత విజయంలో మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ తన అద్బుత ఇన్నింగ్స్‌తో ఛాంపియన్‌గా నిలిపాడు.అతడితో పాటు సంజూ శాంసన్(24), శివమ్ దూబే(33) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు సాధించారు.ట్రోఫీని నిరాకరించిన భారత్.. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసి 45 నిమిషాల సమయం దాటినా బహుమతి ప్రదానోత్సవం జరగలేదు. దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది. భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్‌ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం ట్రోఫీని అందించడానికి ముందుకొచ్చారు. అందుకు టీమిండియా కూడా అంగీకరించింది. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం తనే స్వయంగా ట్రోఫీ అందిస్తాని పట్టుబట్టాడు. దీంతో భారత్ ప్రేజెంటేషన్ వేడుకునే కాకుండా ఏకంగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. దెబ్బకు పీసీబీ చైర్మెన్‌తో పాటు పాక్ ఆటగాళ్లు షాకయ్యారు.కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. భారత్ నుంచి తిలక్, దూబే, అభిషేక్ మాత్రం స్పాన్సర్ల నుంచి తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. అయితే ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.Big Breaking 🚨🚨Team India refuses to accept the Asia Cup 2025 Trophy 🏆 from Pakistan interior minister and ACC Chairman Mohsin Naqvi.Someone just picked up the trophy and walked off the ground.Another Embarrassing Moment for 🇵🇰Video 📷#INDvsPAK #AsiaCupFinal #Tilak pic.twitter.com/h4CrRZgcUF— Globally Pop (@GloballyPop) September 28, 2025చదవండి: ‘ఠాకూర్’ జితాదియా... -
అందుకే ఆసియా కప్‌లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!
‘నో- షేక్‌హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్‌కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్‌కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్‌తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్‌కాట్‌కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్‌తో మాట్లాడారు. నో- షేక్‌హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్‌కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్‌కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
పాకిస్తాన్ భారత్‌లో మ్యాచ్‌లు ఆడదు: పీసీబీ చీఫ్
భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ (ICC Women's ODI World Cup) కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహసిన్ నఖ్వీ శనివారం స్పష్టంచేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐసీసీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లను ‘హైబ్రీడ్ మోడల్’లో దుబాయ్‌లో నిర్వహించారు. ఇప్పుడదే రీతిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. దీనికి గతంలోనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. ‘భారత జట్టు పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు మహిళల ప్రపంచకప్ విషయంలోనే అదే జరుగుతుంది. ఆతిథ్య హోదాలో భారత్ నిర్ణయించిన తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది’అని నఖ్వీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.వెస్టిండీస్ అవుట్.. బంగ్లాదేశ్ క్వాలిఫైభారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకుంది. లాహోర్‌లో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రితూ మోని (48; 5 ఫోర్లు), ఫహీమా ఖాతూన్ (44 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ మహిళల జట్టు 39.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మునీబా అలీ (93 బంతుల్లో 69; 8 ఫోర్లు), ఆలియా రియాజ్ (52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) సత్తాచాటారు.ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 10 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ రెండో ‘ప్లేస్’దక్కించుకుంది. వెస్టిండీస్ కూడా 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు సాధించినా... రన్‌రేట్‌లో స్వల్పంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్ ముందంజ వేసింది. మాథ్యూస్ మెరుపులు వృథా... వెస్టిండీస్ మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లలో లక్ష్యఛేదన పూర్తిచేస్తే మెరుగైన రన్‌రేట్‌తో వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించే అవకాశం ఉండగా...ఐదు బంతుల తేడాతో అవకాశం కోల్పోయింది. ఆ జట్టు 10.5 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొదట థాయ్‌లాండ్ మహిళల జట్టు 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. నాథకన్ చాంతమ్ (66; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4, ఆలియా అలీనె 3 వికెట్లు పడగొట్టింది.అనంతరం ఛేదనలో విండీస్ 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ హేలీ మాథ్యూస్ (29 బంతుల్లో 70; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... షినెల్ హెన్రీ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టింది.మాథ్యూస్ మెరుపులతో కరీబియన్ జట్టు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా కనిపించినా... కీలక సమయంలో ఆమె అవుట్ కావడం విండీస్ అవకాశాలను దెబ్బకొట్టింది. చివర్లో హెన్రీ విజృంభించినా... అది సాధ్యపడలేదు. లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 0.639 రన్‌రేట్‌తో నిలవగా... వెస్టిండీస్ 0.626తో నిలిచింది. అంటే 0.013 తేడాతో వెస్టిండీస్ వరల్డ్‌కప్ పోటీ నుంచి తప్పుకొంది. చదవండి: కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ -
ఏసీసీ నూతన చైర్మన్‌గా పాక్ క్రికెట్ బోర్డు చీఫ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కొత్త చైర్మన్‌గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఎన్నికయ్యారు. శ్రీలంక క్రికెట్ (SLC) అధిపతి షమ్మీ సిల్వా స్థానంలో నఖ్వీ నియమితులయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన సంస్థ ఖండాంతర సభ్యుల ఆన్లైన్ సమావేశం ద్వారా ACC నాయకత్వ మార్పు నిర్ధారించబడింది. నఖ్వీ ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. చైర్మన్ మార్పుకు సంబంధించి ACC నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. సమావేశానికి హాజరైన పలువురు సభ్యులు నఖ్వీ ఎన్నికైన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను నిర్వహించడం నఖ్వీ ముందున్న ప్రథమ పరీక్ష. వాస్తవానికి ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉండింది. అయితే భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలు ఉండటం చేత టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం ఆసియా కప్ మీడియా హక్కులను విక్రయించే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఆసియా కప్‌ను నిర్వహించే తటస్థ దేశం ఏది అనేది నఖ్వీ నిర్ణయించాల్సి ఉంటుంది. టోర్నీ నిర్వహణ రేసులో యూఏఈ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ.. శ్రీలంక కూడా పోటీలో ఉంది. -
సిగ్గుచేటు.. పరువు తీస్తున్నారు: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై ఆ దేశ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) మండిపడ్డాడు. వరుస పరాజయాలతో పరువు తీస్తున్నారని.. ఇందుకు కారణం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చెత్త నిర్ణయాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ క్రికెట్ బాగుపడాలంటే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ వెంటనే రాజీనామా చేయాలని సూచించాడు.వరుస పరాజయాలుకాగా పాక్ జట్టు గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ విజయాల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. సొంతగడ్డపై సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో ఓటమి పాలైంది.అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఘోర పరాభవం పాలైంది. న్యూజిలాండ్, టీమిండియాతో మ్యాచ్‌లలో ఓడి.. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అనంతరం టీ20 కొత్త కెప్టెన్ సల్మాన్ ఆఘా సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ మరోసారి దారుణంగా విఫలమైంది.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో ఆతిథ్య కివీస్ జట్టుకు కోల్పోయింది. ఇక వన్డే సిరీస్‌తో మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వగా.. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన పాక్.. రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.84 పరుగుల తేడాతోమూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పాక్‌పై విజయం సాధించింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మిచెల్ హే (78 బంతుల్లో 99 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు.పాక్ బౌలర్ వసీమ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హే 2,0,6,6,4,4తో 22 పరుగులు పిండుకున్నాడు. కివీస్ ఇతర బ్యాటర్లలో మొహమ్మద్ అబ్బాస్ (41; 3 ఫోర్లు), నిక్ కెల్లీ (31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ వసీమ్, సుఫియాన్ ముఖీమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ పూర్తిగా తడబడింది. 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.ఫహీమ్ అష్రఫ్ (80 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నసీమ్ షా (44 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడారు. వీరిద్దరికీ ఈ ఫార్మాట్లో ఇవే మొదటి హాఫ్ సెంచరీలు. కివీస్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ ఒకదశలో 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (5), బాబర్ ఆజమ్ (1), అబ్దుల్లా షఫీఖ్ (1), ఇమాముల్ హక్ (3), సల్మాన్ ఆఘా (9) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.చివర్లో ఫహీమ్, నసీమ్ షా ధాటిగా ఆడటంతో పాకిస్తాన్ 200 పరుగుల మార్క్ దాటగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సియర్స్ 5 వికెట్లు పడగొట్టగా... జాకబ్ డఫీ 3 వికెట్లు తీశాడు. మిచెల్ హేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.సిగ్గుచేటు.. పరువు తీస్తున్నారుఈ నేపథ్యంలో పాక్ జట్టు వరుస వైఫల్యాలపై మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఘాటుగా స్పందించాడు. ‘‘నిజంగా ఇది సిగ్గు చేటు. పీసీబీ చైర్మన్ పరిస్థితులను చక్కదిద్దకపోయినట్లయితే.. వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలి.అంతేగానీ.. పాక్ క్రికెట్‌కు ఉన్న పేరును నాశనం చేయకండి. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రస్తుత జట్టు పరిస్థితిని బాగుచేయండి’’ అని కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య నామమాత్రమైన చివరి వన్డే శనివారం మౌంట్‌మాంగనీలో జరుగుతుంది. చదవండి: నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్ ప్రశంసలు -
అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. బాబర్ ఆజం (Babar Azam) నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల్లో అద్వితీయ విజయాలు అందుకున్న రిజ్వాన్.. సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు.న్యూజిలాండ్- సౌతాఫ్రికాలతో వన్డే త్రైపాక్షిక సిరీస్‌తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడికి గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. టీ20 జట్టు కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తొలగించి.. సల్మాన్ ఆఘాకు ఆ బాధ్యతలు అప్పగించింది.ఇదిలా ఉంటే.. రిజ్వాన్ తాజాగా పీసీబీ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆడకుండా అతడు.. పెషావర్‌లో ఓ స్థానిక క్లబ్‌కు ఆడినట్లు తెలుస్తోంది. ఇలా నేషనల్ టీ20 కప్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ బక్త్ తప్పుబట్టాడు.పీసీబీని అవమానించాడు.. ఈ విషయంలో రిజ్వాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీకి సూచించాడు. ‘‘నెలకు రూ. 60 లక్షలు తీసుకుంటున్నాడు. మరి జాతీయ జట్టు ఆటగాళ్లు పీసీబీ నిర్వహించే దేశీ మ్యాచ్‌లలో ఎందుకు ఆడరు? దేశవాళీ క్రికెట్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిజ్వాన్ పీసీబీని దారుణంగా అవమానించాడు.సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండిమొహ్సిన్ నక్వీ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తెలుసు. అయితే, ఈసారి మాత్రం ఆయన తన వైఖరి మార్చుకోవాలి. ఇలాంటి వాళ్లపై కొరడా ఝులిపించాల్సిందే. పీసీబీని పట్టించుకోని ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు చేసే దిశగా ఆలోచన చేయాలి’’ అని సికందర్ బక్త్ పేర్కొన్నాడు.బ్యాటర్‌గానూ విఫలంకాగా కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డ మీద వన్డే సిరీస్ గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా రిజ్వాన్ ప్రశంసలు అందుకున్నాడు. కానీ.. ఆ తర్వాత వరుస పరాజయాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అతడి సారథ్యంలో పాకిస్తాన్.. గ్రూప్ దశలో న్యూ జిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయింది.ఇక ఆఖరిదైన మూడో మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దు కావడంతో గెలుపున్నదే లేకుండా ఈ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో రిజ్వాన్ కివీస్‌తో మ్యాచ్‌లో 3, భారత్‌తో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. రోహిత్ సేనతో పోరులో రిజ్వాన్ స్లో ఇన్నింగ్స్ వల్ల పాకిస్తాన్‌కు చేదు అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించడం గమనార్హం. కాగా పాక్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
టీమిండియాను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్‌ను విస్మరించాడు. తన ట్వీట్లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్‌గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్‌లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు. ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్‌కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు. టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా టోర్నీ సక్సెస్ నోట్లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్‌కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్‌కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.కాగా, మార్చి 9న దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్‌పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాక్‌కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది. -
CT 2025: టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే.. ఐసీసీ నిర్ణయం ఇదే
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి.టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడేమరోవైపు.. ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహిస్తారు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లు అన్నీ ఇక హైబ్రిడ్ పద్ధతిలోనేఇదొక్క టోర్నీయే కాదు... ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు. భారత్ మాదిరే పాక్ మ్యాచ్‌ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యాకాగా వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్‌కు క్వాలిఫై అయింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత విదేశాంగ శాఖ సైతం బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో అనేక చర్చల అనంతరం టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. వేదిక మొత్తాన్ని తరలిస్తామంటూ ఐసీసీ కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో పట్టువీడి హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొంది. అయితే, తాము కూడా ఐసీసీ ఈవెంట్ల కోసం ఇకపై భారత్‌లో పర్యటించబోమన్న షరతు విధించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.చదవండి: Vijay Merchant Trophy: సెంచరీతో చెలరేగిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్‌కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్‌తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్‌లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్‌లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
ఐదుగురిని సంప్రదించా.. త్వరలోనే కొత్త కోచ్ ఎంపిక: పీసీబీ చీఫ్
దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్‌స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్‌ను నియమిస్తామని తెలిపాడు.అందుకే రాజీనామా!కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్‌లో కిర్‌స్టెన్‌ను ప్రధాన కోచ్‌గా పీసీబీ నియమించింది. కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్‌గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్‌స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్‌స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్‌స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్‌స్టెన్‌కు పీసీబీ సూచించడం గమనార్హం. ఇక కిర్‌స్టెన్‌తో టెస్టు టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది. ఒక్క వన్డే ఆడకుండా... ఇదిలా ఉంటే.. కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిపిన రికార్డు ఉన్న కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్‌ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్‌ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలుమరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్‌గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్‌స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.ఐదుగురిని సంప్రదించాఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్‌గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే! -
టీమిండియా పాకిస్తాన్‌కు రావాల్సిందే: పీసీబీ చీఫ్
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ టీమిండియాను తమ దేశానికి రప్పించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వద్ద తమ వాదనను వినిపించిన పాక్ బోర్డు.. భారత జట్టు కోసం వేదికను తరలించవద్దని విజ్ఞప్తి చేసింది.వేదిక మార్చబోమన్న ఐసీసీ ఇందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే(పీసీబీ) ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుందని.. వేదికను మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇందుకు సుముఖంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి.కేంద్రం అనుమతినిస్తేనేఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్తాన్ పర్యటనకు పంపకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా అనేది భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు. కేంద్రం అనుమతినిస్తేనే తమ జట్టు ఏ టూర్‌కైనా వెళ్లుందని.. పాకిస్తాన్ కూడా ఇందుకు మినహాయింపుకాదని పేర్కొన్నాడు.జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో నక్వీ భేటీ కానున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ పాకిస్తాన్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే.ఇస్లామాబాద్‌లో అక్టోబరు 15-16 తేదీల్లో ఈ సమ్మిట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో నక్వీ జైశంకర్‌ను కలిసి.. టీమిండియా పాక్ పర్యటన గురించి మాట్లాడాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఈ ఐసీసీ టోర్నీ వీక్షించేందుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందేఇందుకు సంబంధించిన ప్రొటోకాల్స్, భద్రతా అంశాల గురించి మొహ్సిన్ నక్వీ.. జైశంకర్‌కు వివరించనున్నట్లు క్రికెట్ పాకిస్తాన్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో నక్వీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ఇక్కడకు వస్తుందనే అనుకుంటున్నాం. పర్యటనను రద్దు చేసుకోవడానికి గానీ.. వాయిదా వేయడానికి గానీ కారణాలు లేవు. అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందే’’ అని పేర్కొన్నాడు. కాగా 2008 ఆసియా కప్ తర్వాత ఇంత వరకు భారత జట్టు ఒక్కసారి కూడా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ కూడా పాక్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పాల్గొనడం లేదు. అయితే, గతేడాది ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. టీమిండియా అక్కడకు వెళ్లలేదు. ఎవరి మాట నెగ్గుతుందో?దీంతో రోహిత్ సేన ఆడిన మ్యాచ్‌లకు తటస్థ వేదికగా శ్రీలంకను ఉపయోగించుకున్నారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్ విధానాన్ని అనుసరించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం. కానీ పీసీబీ మాత్రం తమ దేశంలో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్టు పర్యటించాయని.. ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి! కాగా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ -
జై షా స్థానాన్ని భర్తీ చేయనున్న పీసీబీ చీఫ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవి చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న ఐసీసీ బాస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నారు.అదే విధంగా.. ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగానూ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న చర్చ జరుగుతుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేరు తెరమీదకు వచ్చింది. జై షా స్థానాన్ని నక్వీ భర్తీ చేయనున్నాడని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.కొత్త బాస్‌గా నక్వీ?‘‘వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో.. కొత్త అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ ఎంపిక కానున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు’’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కాగా ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.అయితే, పాక్ బోర్డు మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని పట్టుపట్టగా.. జై షా నేతృత్వంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాక్‌తో పాటు శ్రీలంకను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసి.. టీమిండియా మ్యాచ్‌లను అక్కడ నిర్వహించింది. భారత్‌తో పాటు లంక ఫైనల్‌కు చేరగా.. టైటిల్ పోరు కూడా శ్రీలంకలోనే జరిగింది. అయితే, జై షా స్థానంలో నక్వీ వస్తే.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.ఐసీసీ టోర్నీలకు సన్నాహకాలుగాఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్‌లో పురుషుల ఆసియాకప్ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని2025 సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026కు ముందుగా ఈ టోర్నీని నిర్వహించడం వల్ల.. ఆసియా దేశాలకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. అనంతరం.. ఆసియా కప్-2027నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. -
పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు: పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో తొలిసారి పాక్ బంగ్లాతో మ్యాచ్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అది కూడా సొంతగడ్డపై ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి షాన్ మసూద్ బృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. అయితే, ఈ ఘోర పరాభవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. అవినీతిలో కూరుకుపోయిన నక్వీ నేతృత్వంలోని బోర్డు పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు‘‘దేశ ప్రజలు టీవీలో ఆసక్తిగా చూసే ఏకైక క్రీడ క్రికెట్. కానీ ఇప్పుడు దానిని కూడా నాశనం చేస్తున్నారు. సమర్థత లేని, తమకు ప్రియమైన అధికారులను నియమించుకోవడం వల్లే పాక్ బోర్డుకు ఈ గతి పట్టింది. వాళ్ల హయాంలో తొలిసారి మన జట్టు వన్డే వరల్డ్‌కప్ టాప్-4కు చేరలేకపోయింది.టీ20 ప్రపంచకప్-2024 టాప్-8లోనూ నిలవలేకపోయింది. ఇప్పుడు ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడి పూర్తిగా దిగజారిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఇదే జట్టు టీమిండియాను ఓడించింది కదా! మరి ఈ స్వల్ప కాలంలో అంతగా ఏం జరిగిందని.. ఇంతటి ఘోర పరాభవాలు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి? దీనంతటికీ ఒకే వ్యవస్థ కారణం’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పాక్ బోర్డుపై నిప్పులు చెరిగాడు.పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలుఅదే విధంగా.. నక్వీ దుబాయ్‌లో తన భార్య పేరు మీద ఐదు మిలియన్ డాలర్ల మేర ఆస్తులు కూడబెట్టాడని.. 2008లో అవినీతి ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నాడని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అనే పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్.. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఈ మాజీ క్రికెటర్‌పై ఇతరత్రా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు రావల్పిండి సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా ఈమేరకు సందేశం పంపించాడు.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)వేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు -
పాక్ స్టేడియాల్లో కనీస వసతులు లేవు.. ఒక్కటీ..: పీసీబీ చీఫ్
పాకిస్తాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేవని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్నారు. చాలా స్టేడియాల్లో కనీస వసతులు కూడా లేవని పెదవి విరిచారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఈ దుస్థితిని మార్చే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టామని తెలిపారు.వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియాలను పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పీసీబీ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో లాహోర్‌లో గల ప్రసిద్ధ గడాఫీ స్టేడియాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సందర్శించారు.మన స్టేడియాలు బాలేవుఈ సందర్భంగా నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన స్టేడియాలకు.. అంతర్జాతీయ స్టేడియాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మన స్టేడియాల్లో ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రక్షాళన చర్యలు చేపట్టాం. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ రాత్రిపగలూ తేడా లేకుండా ఎంతో కష్టపడుతోంది.ప్రథమ ప్రాధా న్యం అదేప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా మన స్టేడియాలను తీర్చిదిద్దుతాం. అయితే, అంతకంటే ముందు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో క్రికెట్ స్టేడియాల పునరుద్ధరణలో భాగంగా పీసీబీ ఇప్పటికే 17 బిలియన్ల పాక్ రూపాయలను కేటాయించినట్లు సమాచారం.ఇక ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ పీసీబీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాక్‌కు వెళ్లబోదని బీసీసీఐ పెద్దలు చెబుతుండగా.. హైబ్రిడ్ విధానానికి తాము ఒప్పుకోమని పీసీబీ అంటోంది. ఈ విషయంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!!చదవండి: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక అదే: పీసీబీ చీఫ్