
ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తొమ్మిదో సారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.
భారత విజయంలో మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ తన అద్బుత ఇన్నింగ్స్‌తో ఛాంపియన్‌గా నిలిపాడు.
అతడితో పాటు సంజూ శాంసన్(24), శివమ్ దూబే(33) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు సాధించారు.
ట్రోఫీని నిరాకరించిన భారత్..
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసి 45 నిమిషాల సమయం దాటినా బహుమతి ప్రదానోత్సవం జరగలేదు. దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది. భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్‌ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం ట్రోఫీని అందించడానికి ముందుకొచ్చారు.
అందుకు టీమిండియా కూడా అంగీకరించింది. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం తనే స్వయంగా ట్రోఫీ అందిస్తాని పట్టుబట్టాడు. దీంతో భారత్ ప్రేజెంటేషన్ వేడుకునే కాకుండా ఏకంగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. దెబ్బకు పీసీబీ చైర్మెన్‌తో పాటు పాక్ ఆటగాళ్లు షాకయ్యారు.
కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. భారత్ నుంచి తిలక్, దూబే, అభిషేక్ మాత్రం స్పాన్సర్ల నుంచి తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. అయితే ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.
Big Breaking 🚨🚨
Team India refuses to accept the Asia Cup 2025 Trophy 🏆 from Pakistan interior minister and ACC Chairman Mohsin Naqvi.
Someone just picked up the trophy and walked off the ground.
Another Embarrassing Moment for 🇵🇰
Video 📷#INDvsPAK #AsiaCupFinal #Tilak pic.twitter.com/h4CrRZgcUF— Globally Pop (@GloballyPop) September 28, 2025
చదవండి: ‘ఠాకూర్’ జితాదియా...