
ఆసియాకప్-2025 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచిన అనంతరం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్‌మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.
ప్రోటోకాల్ ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాస్ అయిన మొహ్సిన్ నఖ్వీనే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ట్రోఫీని అతడి నుంచి తీసుకోవాడనికి మెన్ ఇన్ బ్లూ సముఖత చూపలేదు.
దీంతో దాదాపు గంట అలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కేవలం పాక్ ఆటగాళ్లే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. అయితే భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని తెలియజేసింది.
అందుకు వారిద్దరూ అంగీకరించారు. కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తానే అందిస్తానని మొండిపట్టు పట్టాడు. దీంతో టీమిండియా పూర్తిగా ట్రోఫీనే తీసుకోమని తేల్చి చెప్పేసింది. భారత్ తీరుతో సహనం కోల్పోయిన పీసీబీ చీఫ్.. ఆసియా కప్ ట్రోఫీతో పాటు, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను హోటల్‌కు తీసుకువెళ్లిపోయాడు.
ఈ క్రమంలో నఖ్వీ వ్యవహరించిన తీరు పట్ల సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చర్యను భారత క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సైకియా తెలిపారు.
బీసీసీఐ సీరియస్..
"భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. పాకిస్తాన్ సీనియర్ లీడర్స్‌లో ఒకరిగా ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు. అటువంటి అప్పుడు అతడి చేతుల మీదగా ట్రోఫీని ఎలా తీసుకుంటాము? అతడి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాము.
అతడు చేతుల మీదగా తీసుకోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. ట్రోఫీని, పతకాలను హోటల్ గదికి తీసుకువెళ్లే హక్కు ఎవరు ఇచ్చారు? నఖ్వీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. అతడికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఈ విషయంపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భారత్‌కు పంపిస్తారని ఆశిస్తున్నా" అని ఎఎన్ఐతో సైకియా పేర్కొన్నాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్