భారత పురుషుల క్రికెట్ జట్టు
ముంబై: టీమ్ ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ ఎలెవన్ అర్ధాంతరంగా తప్పుకొన్న తర్వాత కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయానికి ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు. ఎక్కువ మొత్తానికి అపోలో టైర్స్‌తో స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కిట్ స్పాన్సర్ అడిడాస్ ద్వారా బోర్డు ఆ లోటును పూరించుకుంది.
రూ. 3,358 కోట్లు పెరుగుదల
బోర్డు సంయుక్త కార్యదర్శి (గత కోశాధికారి) ప్రభ్‌తేజ్ భాటియా రాబోయే 2025–26 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ (BCCI) ఆదాయ అంచనాల గురించి వివరిస్తూ గత ఏడాది 2024–25కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దీని ప్రకారం గత ఏడాది బోర్డు ప్రాథమిక నిధిలో రూ. 3,358 కోట్లు పెరుగుదల కనిపిస్తూ మొత్తం రూ.11,346 కోట్లకు చేరింది. అపోలో టైర్స్‌తో రూ. 358 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ... జెర్సీ స్పాన్సర్ అడిడాస్ నుంచి కూడా పెద్ద మొత్తాన్ని పొందినట్లు సమాచారం.
తగ్గిన ఐసీసీ వాటా
అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి ప్రతీ ఏటా వచ్చే ఆదాయంలో మాత్రం కోత పడిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ప్రతీ ఏడాది ఐసీసీ తమ ఆదాయం నుంచి భారత బోర్డుకు 38.5 శాతం అందిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐకి రూ.8,963 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు.


