సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం ప్రిటోరియా క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపొందింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ జట్టుకు అదనంగా ఒక బోనస్ పాయింట్ కూడా లభించింది.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి చెలరేగాడు. 47 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 5 ఫోర్లు, 6 సిక్సకర్లతో 77 పరుగులు చేశాడు. అతడితో పాటు మాథ్యూ బ్రీట్జ్కే(33 బంతుల్లో 52 పరుగులు), జోర్డాన్ హెర్మాన్(20 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. లుంగి ఎంగిడీ, లుబ్బే తలా వికెట్ సాధించారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ 18 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ స్పీడ్ స్టార్ ఆడమ్ మిల్నే 4 వికెట్లు పడగొట్టగా.. రత్నాయకే రెండు, మార్కో జాన్సెన్, ముత్తుసామి తలా వికెట్ సాధించారు.
ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్(36) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిడ్(35), రుథర్ ఫర్డ్(25) ఫర్వాలేదన్పించారు. కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తున్నాడు. ప్రధాన కోచ్‌గా అతడికి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది.
చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!


