T20 WC 2026: క్వింటన్‌ డికాక్‌ ‘వరల్డ్‌’ రికార్డు | T20 WC 2026 Quinton de Kock Equals MS Dhoni World Record | Sakshi
Sakshi News home page

T20 WC 2026: క్వింటన్‌ డికాక్‌ ‘వరల్డ్‌’ రికార్డు

Feb 10 2026 1:08 PM | Updated on Feb 10 2026 1:17 PM

T20 WC 2026 Quinton de Kock Equals MS Dhoni World Record

సౌతాఫ్రికా క్రికెట్‌ స్టార్‌ క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా గ్రూప్‌-‘డి’లో నుంచి సౌతాఫ్రికా- కెనడా సోమవారం పోటీపడ్డాయి.

మార్క్రమ్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన కెనడా.. సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (32 బంతుల్లో 59) సాధించగా.. క్వింటన్‌ డికాక్‌ 22 బంతుల్లో 25 పరుగులు చేయగలిగాడు.

మిగతా వారిలో ర్యాన్‌ రికెల్టన్‌ (21 బంతుల్లో 33), డేవిడ్‌ మిల్లర్‌ (23 బంతుల్లో 39 నాటౌట్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.

156 పరుగులకే పరిమితం
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 156 పరుగులకే పరిమితం అయింది. దీంతో సౌతాఫ్రికా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ పేసర్‌ లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లతో చెలరేగి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

క్వింటన్‌ డికాక్‌ ‘వరల్డ్‌’ రికార్డు
ఇక ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ రెండు డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో కెనడా ఓపెనర్లు కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా (0), యువరాజ్‌ సమ్రా (12) ఇచ్చిన క్యాచ్‌లను డికాక్‌ ఒడిసిపట్టాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్‌గా ధోని వరల్డ్‌ రికార్డును డికాక్‌ సమం చేశాడు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లు వీరే
🏏🧤క్వింటన్‌ డికాక్‌- 32
🏏🧤ఎంఎస్‌ ధోని- 32
🏏🧤కమ్రాన్‌ అక్మల్‌- 30
🏏🧤దినేశ్‌ రామ్‌దిన్‌- 27
🏏🧤కుమార్‌ సంగక్కర- 26
🏏🧤జోస్‌ బట్లర్‌- 26.

చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement