South Africa vs Canada
-
T20 WC 2026: క్వింటన్ డికాక్ ‘వరల్డ్’ రికార్డు
సౌతాఫ్రికా క్రికెట్ స్టార్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా గ్రూప్-‘డి’లో నుంచి సౌతాఫ్రికా- కెనడా సోమవారం పోటీపడ్డాయి.మార్క్రమ్ మెరుపు హాఫ్ సెంచరీఅహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన కెనడా.. సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మెరుపు హాఫ్ సెంచరీ (32 బంతుల్లో 59) సాధించగా.. క్వింటన్ డికాక్ 22 బంతుల్లో 25 పరుగులు చేయగలిగాడు.మిగతా వారిలో ర్యాన్ రికెల్టన్ (21 బంతుల్లో 33), డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 39 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (19 బంతుల్లో 34 నాటౌట్) రాణించారు. ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.156 పరుగులకే పరిమితంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 156 పరుగులకే పరిమితం అయింది. దీంతో సౌతాఫ్రికా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.క్వింటన్ డికాక్ ‘వరల్డ్’ రికార్డుఇక ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రెండు డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో కెనడా ఓపెనర్లు కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా (0), యువరాజ్ సమ్రా (12) ఇచ్చిన క్యాచ్‌లను డికాక్ ఒడిసిపట్టాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్‌గా ధోని వరల్డ్ రికార్డును డికాక్ సమం చేశాడు.టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు వీరే🏏🧤క్వింటన్ డికాక్- 32🏏🧤ఎంఎస్ ధోని- 32🏏🧤కమ్రాన్ అక్మల్- 30🏏🧤దినేశ్ రామ్‌దిన్- 27🏏🧤కుమార్ సంగక్కర- 26🏏🧤జోస్ బట్లర్- 26.చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం -
T20 WC 2026 Feb 9: ఈరోజు జరిగే మ్యాచ్‌లు ఇవే
భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7) తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో తొలుత గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాక్ ఊపిరి పీల్చుకుంది.ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవేఅనంతరం మధ్యాహ్నం మ్యాచ్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గ్రూప్-సి నుంచి వెస్టిండీస్- స్కాట్లాండ్ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ 35 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను ఓడించింది. ఇక సాయంత్రం మ్యాచ్‌లో గ్రూప్-ఎ నుంచి టీమిండియా- అమెరికా తలపడగా.. భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇక ఆదివారం (ఫిబ్రవరి 8) నాటి మ్యాచ్‌లో చెన్నైలో అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్.. ముంబైలో నేపాల్‌పై ఇంగ్లండ్.. ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించాయి. మరి సోమవారం నాటి షెడ్యూల్ ఎలా ఉందంటే..టీ20 ప్రపంచకప్-2026: ఫిబ్రవరి 9 షెడ్యూల్ ఇదేగ్రూప్-సి: స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ- ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా- ఉదయం 11 గంటలకు ఆరంభంగ్రూప్-బి: జింబాబ్వే వర్సెస్ ఒమన్- సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో- మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభంగ్రూప్-డి: సౌతాఫ్రికా వర్సెస్ కెనడా- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్- రాత్రి ఏడు గంటలకు ఆరంభంకాగా వరల్డ్‌కప్ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా.. గ్రూప్- బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్, ఐర్లాండ్ పోటీపడుతున్నాయి.ఇక గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ, అఫ్గనిస్తాన్ రేసులో ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్!


