
ఆసియా కప్ (Asia cup 2025) ట్రోఫీ విషయంలో ఏసీసీ (Asia Cricket Council) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) మొండిపట్టు వీడటం లేదు. తన వద్ద ఉంచుకున్న ట్రోఫీని నిర్వహకులకు ఇచ్చేయాలని నిన్న (సెప్టెంబర్ 30) జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాథ్యక్షుడు రాజీవ్ శుక్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. పైగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు (Surya Kumar Yadav) కొత్త షరతు పెట్టాడు.
ట్రోఫీ కావాలంటే స్వయంగా నా ఆఫీస్‌కు వచ్చి తీసుకోవాలని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. నఖ్వీ వాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నఖ్వీ ఓవరాక్షన్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నఖ్వీ విషయంలో బీసీసీఐ, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. తక్షణమే అతన్ని ఏసీసీ అధ్యక్ష హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరస్కరించాడు. ఇందుకు ప్రతిగా నఖ్వీ భారత ఆటగాళ్లకు అందించాల్సిన మెడల్స్‌ను, ట్రోఫీని ఎత్తుకెళ్లిపోయాడు. నఖ్వీ ట్రోఫీ ఇవ్వకపోయినా భారత ఆటగాళ్లు కృత్రిమంగా ట్రోఫీని అందుకున్నట్లు సంబురాలు చేసుకున్నారు.
దీనిపై నిన్న జరిగిన ఏసీసీ సర్వసభ్య సమావేశం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అయినా నఖ్వీ మొండిపట్టు వీడలేదు. ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని దాటవేశాడు. నఖ్వీ ప్రవర్తనపై యావత్ భారతావణి మండిపడుతుంది. వీడి వేశాలేంట్రా బాబు అని అనుకుంటుంది. ట్రోఫీ తీసుకున్నా, తీసుకోకపోయినా విజేతలం మనమే అని సర్దుకుపోతుంది.
చదవండి: అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..