భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో సూర్యకుమార్ యాదవ్ తనకు తరచూ మెసేజ్‌లు చేసేవాడని బాంబు పేల్చింది. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సంభాషణ జరగడం లేదని తెలిపింది.
ఓ ఈవెంట్ సందర్భంగా ఎవరైనా క్రికెటర్‌తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అని రిపోర్టర్ అడగగా ఖుషి ఇలా బదులిచ్చింది. "నేను ఎలాంటి క్రికెటర్‌తో డేట్ చేయాలనుకోవడం లేదు. చాలా మంది క్రికెటర్లు నన్ను ఫాలో అవుతున్నారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ తురుచూ మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు. నాకు లింక్ అప్స్ అస్సలు నచ్చవు" అని స్పషం చేసింది.
సూర్యకుమార్ యాదవ్ గురించి ఖుషి బయటపెట్టిన ఈ సంచలన విషయాలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. తరుచూ భార్యతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లే సూర్యకుమార్ యాదవ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇవాళే సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీషా శెట్టితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి పూజలు చేశాడు. స్కై సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, ఖుషి వ్యాఖ్యలు బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.
కోల్‌కతాలో జన్మించిన ఖుషి ఎంటీవీలో ప్రసారమయ్యే Splitsvilla రియాలిటీ షో ద్వారా బాగా పాపులరైంది. మోడల్ కూడా అయిన ఖుషి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నితిన్‌తో కలిసి హార్ట్ అటాక్.. ఆకాశ్‌తో కలిసి దొంగ ప్రేమ తదితర సినిమాల్లో లీడ్ రోల్‌లో యాక్ట్ చేసింది.

సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే.. అతని సారథ్యంలో భారత టీ20 జట్టు ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1 తేడాతో విజయం సాధించింది. త్వరలో స్కై నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సూర్యకుమారే సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్, టీ20 వరల్డ్‌కప్‌ల కోసం టీమిండియాను ప్రకటించారు. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాను తిరుగులేని జట్టుగా నడిపిస్తున్న సూర్యకుమార్.. వ్యక్తిగతంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు.


