60 ఏళ్ల తర్వాత... | Italian driver wins title in Italian Grand Prix | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల తర్వాత...

Sep 7 2026 2:05 AM | Updated on Sep 7 2026 2:05 AM

Italian driver wins title in Italian Grand Prix

ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రిలోఇటలీ డ్రైవర్‌కు టైటిల్‌  

మోంజా: ఆరు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. ఫార్ములావన్‌ రేసింగ్‌ ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రిలో ఇటలీకే చెందిన డ్రైవర్‌ విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటలీకి చెందిన 20 ఏళ్ల కిమీ ఆంటోనెల్లి చాంపియన్‌గా నిలిచాడు. 19వ స్థానం నుంచి రేసును ఆరంభించిన ఆంటోనెల్లి నిర్ణీత 53 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 51 నిమిషాల 15.281 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

1966లో లుడోవికో స్కార్‌ఫియోటి తర్వాత ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ సాధించిన ఇటలీ డ్రైవర్‌గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. అత్యంత వెనుక స్థానంలో నుంచి రేసును ప్రారంభించి విజేతగా నిలిచిన రెండో డ్రైవర్‌గా ఆంటోనెల్లి ఘనత వహించాడు. 1983లో యునైటెడ్‌ స్టేట్స్‌ గ్రాండ్‌ప్రిలో జాన్‌ వాట్సన్‌ (మెక్‌లారెన్‌–ఫోర్డ్‌) 22వ స్థానం నుంచి రేసును ఆరంభించి అగ్రస్థానం పొందాడు. ఈ సీజన్‌లో ఆంటోనెల్లికిది ఏడో విజయం. 23 రేసుల సీజన్‌లో 13 రేసులు ముగిశాక ఆంటోనెల్లి 267 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement