మోఖి (చైనా): జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 11–1తో గెలిచింది. భారత్ తరఫున పూజ సాహూ, గీత యాదవ్, పూర్ణిమ, సనిక రెండేసి గోల్స్ చేయగా... బినిమా, క్రిష్ణ శర్మ, సుఖ్‌వీర్ కౌర్ తలా ఒక గోల్ చేశారు. మలేసియా జట్టు తరఫున నూర్ ఏకైక గోల్ చేసింది. మరోవైపు జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత పురుషుల జట్టు 3–3తో ‘డ్రా’ చేసుకుంది.


