మోఖి (చైనా): జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు బోణీ కొట్టాయి. శనివారం డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల జట్టు 14–0 గోల్స్ తేడాతో ఇండోనేసియాను చిత్తుచేయగా... మహిళల జట్టు 4–1 గోల్స్‌తో దక్షిణ కొరియా పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత్ గోల్స్ వర్షం కురిపించింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ప్రభ్‌దీప్ సింగ్ 5 గోల్స్‌తో విజృంభించగా... కెపె్టన్ అన్‌మోల్ ఎక్కా 4 గోల్స్ సాధించాడు. అజీత్ యాదవ్ మూడు గోల్స్‌తో మెరవగా... హర్‌పాల్, మౌర్య చెరో గోల్ కొట్టారు. మహిళల మ్యాచ్‌లో సనిక, పూర్ణిమ యాదవ్, పూజ, మధు ఒక్కో గోల్‌చేశారు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో నేడు జపాన్‌తో భారత పురుషుల జట్టు, మలేసియాతో మహిళల జట్టు తలపడనున్నాయి.


