ఈస్ట్‌ జోన్‌ X సౌత్‌ జోన్‌ | Duleep Trophy final from today | Sakshi
Sakshi News home page

ఈస్ట్‌ జోన్‌ X సౌత్‌ జోన్‌

Sep 6 2026 3:04 AM | Updated on Sep 6 2026 3:04 AM

Duleep Trophy final from today

నేటి నుంచి దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ 

ఉదయం గం. 9:30 నుంచి జియో హాట్‌ స్టార్‌ లో ప్రత్యక్ష ప్రసారం  

చెన్నై: దేశవాళీ టోర్నీ దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌తో సౌత్‌ జోన్‌ అమీతుమీకి సిద్ధమైంది. తిలక్‌ వర్మ సారథ్యంలోని సౌత్‌ జోన్‌ జట్టులో భారత ఆటగాళ్లు దేవదత్‌ పడిక్కల్, మొహమ్మద్‌ సిరాజ్‌తో పాటు రికీ భుయ్, షేక్‌ రషీద్, జగదీశన్, స్మరణ్, శ్రేయస్‌ గోపాల్‌ ఉన్నారు. కేఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌ ఆడడం లేదని సారథి తిలక్‌ మ్యాచ్‌కు ముందు రోజు వెల్లడించాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కావెరప్ప స్థానంలో హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ సీవీ మిలింద్‌కు సౌత్‌ జోన్‌ జట్టులో చోటు దక్కింది. 

మరోవైపు ఇషాన్‌ కిషన్‌ సారథ్యంలోని ఈస్ట్‌జోన్‌లో 15 ఏళ్ల ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సెమీఫైనల్లో దంచికొట్టిన అతడు ఫైనల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. వందో ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడుతున్న సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ తనలో వాడి తగ్గలేదని చాటుతుండగా... ముకేశ్‌ కుమార్, అభిజిత్‌ సర్కార్‌ అతడికి అండగా నిలుస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement