Photo Credit: BCCI Twitter
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోకి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయాన్ని అందుకుంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేధించింది.
కెప్టెన్ ఇషాన్ కిషన్ (39 నాటౌట్), మహ్మద్ షమీ (8 నాటౌట్) అజేయంగా నిలిచి ఈస్ట్‌జోన్‌ను గెలిపించారు. వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (40) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు.
ఇక సెంట్రల్ జోన్ తమ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో షమీ, ముకేశ్ కుమార్ మెరుపులతో సెంట్రల్ జోన్ అనూహ్యంగా 158 పరుగులకే కుప్పకూలింది. అయితే ఛేదనలో ఈస్ట్‌జోన్ కాస్త తడబడినప్పటికీ, ముందు వైభవ్.. చివర్లో ఇషాన్, షమీలు బాధ్యతగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
139 పరుగుల ఆధిక్యంలో నార్త్‌జోన్
మరోవైపు నార్త్‌జోన్, సౌత్‌జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నార్త్‌జోన్ 139 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్‌జోన్ 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. నిషాంత్ సింధూ (20), అన్షుల్ కంబోజ్ (29) క్రీజులో ఉన్నారు. అంతకముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైంది.
𝐄𝐀𝐒𝐓 𝐙𝐎𝐍𝐄 𝐀𝐑𝐄 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐃𝐔𝐋𝐄𝐄𝐏 𝐓𝐑𝐎𝐏𝐇𝐘 𝐅𝐈𝐍𝐀𝐋! 🔥🏆
A statement win over defending champions Central Zone, sends East Zone into the Duleep Trophy summit clash! 💥👏 pic.twitter.com/lNed1OiRyt— CricTracker (@Cricketracker) September 1, 2026


