source: X
భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ 2026 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రియాన్ అయూబ్–టాన్ వీ కియోంగ్ జోడీని 21-15, 18-21, 21-11తో ఓడించింది.
65 నిమిషాల పాటు సాగిన పోరులో భారత జోడీ తొలి గేమ్‌ను పూర్తి ఆధిపత్యంతో గెలిచినా, రెండో గేమ్‌లో కీలక దశలో పాయింట్లు కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ పూర్తిగా పుంజుకుని, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు.
ఫైనల్లో చైనా జోడీతో పోరు
ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ చైనాకు చెందిన హీ జీ టింగ్–రెన్ జియాంగ్ యు జోడీని ఎదుర్కోనుంది. చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్‌కు ఇది మూడో ఫైనల్. 2023, 2025లో వారు రన్నరప్‌గా నిలిచారు. కాబట్టి ఈసారి టైటిల్ సాధిస్తే వారి తొలి చైనా మాస్టర్స్ టైటిల్ అవుతుంది.


