పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ | Women Asia Cup: Pak Opt-Batting-Harmanpreet-Huge-Captaincy Record | Sakshi
Sakshi News home page

Women Asia Cup: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్

Sep 5 2026 7:53 PM | Updated on Sep 5 2026 9:06 PM

Women Asia Cup: Pak Opt-Batting-Harmanpreet-Huge-Captaincy Record

Photo Credit: Twitter

మహిళల ఆసియా కప్ టోర్నీ-2026లో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలయ్యింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.   థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌లపై విజయాలతో భారత్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి అజేయంగా నిలవాలని టీమిండియా భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించింది. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన జాబితాలో హర్మన్ తొలి స్థానంలో నిలిచింది. హర్మన్‌కు కెప్టెన్‌గా ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యహరించిన రికార్డు హర్మన్ పేరిటే ఉంది. 

ఈ జాబితాలో చమేరీ ఆటపట్టు 121 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ (100 మ్యాచ్‌లు), హెథర్ నైట్ (96 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌ ఎలాంటి మార్పులు చేయలేదు.  

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్ కీపర్‌), దీప్తి శర్మ, ప్రేమ రావత్, నందనీ శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.

పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ(వికెట్ కీపర్‌), షావాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా(కెప్టెన్‌), ఉమ్-ఎ-హనీ, ఈమాన్ ఫాతిమా, తుబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.

 

Read: వైరలవుతున్న అల్క‌రాజ్ బ‌నియ‌న్‌ .. ఇదేం కర్మరా దేవుడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement