బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్‌ | ENG-Club-Cricketer Runs 100km-To-Bowl 1st-Ball-Guinness Record | Sakshi
Sakshi News home page

బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్‌

Sep 5 2026 5:42 PM | Updated on Sep 5 2026 6:28 PM

ENG-Club-Cricketer Runs 100km-To-Bowl 1st-Ball-Guinness Record

Photo Credit: Twitter

ఇంగ్లండ్‌ క్లబ్ క్రికెటర్, అథ్లెట్ సామ్ బోడోనో క్రికెట్ చరిత్రలోనే అత్యంత పొడవైన రన్-అప్ (Longest Bowling Run-up) తో తొలి బంతిని వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నించాడు. బంతి వేయడానికి ఏకంగా వంద కిలోమీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె పేరిట ఆండ్రూ స్ట్రాస్ నడుపుతున్న రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ ఫర్ క్యాన్సర్ చారిటీకి సామ్‌ బోడోవాన్‌ 6 వేల పౌండ్లు సేకరించి అందించాడు. 

ఈ క్రమంలో వ్యాలీ క్రికెట్ గ్రౌండ్‌లో  బ్యాటింగ్ చేస్తున్న సామ్ బోడోవానో తండ్రికి తొలి బంతి వేసేందుకు సామ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి బౌలింగ్ రన్‌-అప్ ప్రారంభించాడు. 14 గంటల్లో 100 కిమీ దూరం (62 మైళ్లు) పరిగెత్తి బంతిని విసరడం విశేషం. ఈ నేపథ్యంలో క్రికెట్ చరిత్రలోనే అత్యంత పొడవైన రన్‌-అప్‌తో సామ్ బోడోవానో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు.

గతంలో అత్యంత లాంగెస్ట్ రన్‌-అప్ టామ్‌ డున్ పేరిట ఉంది. 2024 ఆగస్టులో ఇతగాడు ఈస్ట్ లండన్‌లోని బెత్నెల్ గ్రీన్ నుంచి సౌత్ లండన్‌లోని వాండ్స్‌వార్త్ మధ్య 24 కిమీ దూరం (15 మైళ్లు) పరిగెతాడు. తాజాగా టామ్ రికార్డును సామ్ సవరించాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ 2019లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు విడిచింది. 

అదే ఏడాది ఆమె గుర్తుగా ఆండ్రూ స్ట్రాస్ రూత్ స్ట్రాస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆండ్రూ స్ట్రాస్ 2003 నుంచి 2012 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్ గొప్ప బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్ట్రాస్‌ 100 టెస్టుల్లో  7,037 పరుగులు, 127 వన్డేల్లో 4,205 పరుగులు సాధించాడు.

Read: ‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement