Photo Credit: Twitter
కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ మెయిడెన్ వికెట్ సాధించాడు. సీజన్‌లో సర్రే తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అకిబ్ నబీ భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా కౌంటీల్లో తొలి వికెట్ పొందాడు. యార్క్‌షైర్‌తో మ్యాచ్ సందర్భంగా నబీ వేసిన బంతిని ఆడే క్రమంలో కుల్దీప్ స్లిప్‌లో ఆడి కార్డన్‌కు దొరికిపోయాడు. దీంతో అప్పటివరకు ఉన్న పార్టనర్‌షిప్ బ్రేక్ అవ్వడంతో పాటు 53 బంతుల తర్వాత వికెట్ లభించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయంది.
ఇక జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన అకిబ్ నబీ గత నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ సిరీస్‌లో మ్యాచ్ ఆడే అవకాశం అతడికి రాలేదు. దీంతో సిరీస్ ముగిసిన వెంటనే కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లండ్ చేరుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి కౌంటీ ఆడుతున్న అకిబ్ నబీ తన బౌలింగ్ మెరుపులను ఇంగ్లీష్ గడ్డపై ప్రత్యర్థులకు రుచి చూపించే పనిలో పడ్డాడు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఉండడంతో కౌంటీల్లో సత్తా చాటి మరోసారి జట్టుకు ఎంపికవ్వాలని అకిబ్ నబీ భావిస్తున్నాడు. ఇక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసిన నబీ రెండో ఇన్నింగ్స్‌లో జేమ్స్ వార్టన్‌ను ఔట్ చేసి రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌లో సర్రే జట్టు విజయం దిశగా నడుస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్రే జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.
దేశవాళీలో సంచలన ప్రదర్శన
ఇక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ తరఫున అకిబ్ నబీ వరుసగా రెండేళ్లు సంచల ప్రదర్శన నమోదు చేశాడు. 2025-26 రంజీ సీజన్‌లో అకిబ్ నబీ 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్ టైటిల్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే అకిబ్ నబీ 43 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 162 వికెట్లు పడగొట్టాడు.
ఈ ప్రదర్శనతోనే అకిబ్ నబీ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 8.4 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. కౌంటీ ముగిసిన తర్వాత అకిబ్ నబీ స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాడు. అంతేకాదు న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మదిలో ఉన్న ఐదుగురు ఫాస్ట్ బౌలర్లలో అకిబ్ నబీ పేరు కూడా ఉండడం విశేషం.
Auqib Nabi gets his first Surrey wicket as Kuldeep Yadav is caught at second slip by Ollie Pope. ✅
Yorkshire 170/8 at the Kia Oval.
🤎 | #CountyChampionship pic.twitter.com/VXVuEeI4mA— Surrey Cricket (@surreycricket) September 3, 2026
Read: చివరి గ్రాండ్‌స్లామ్ ఆడిన ఫ్రెంచ్ ఐకాన్.. భార్య ఎవరో తెలిస్తే షాక్!


