హాంకాంగ్‌పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం! | Smriti Mandhana Emotional-After Match Won Vs Hong Kong Women Asia Cup | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం!

Sep 4 2026 8:59 AM | Updated on Sep 4 2026 10:05 AM

Smriti Mandhana Emotional-After Match Won Vs Hong Kong Women Asia Cup

Photo Credit: BCCI Twitter

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో అదరగొడుతుంది. పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధన శతకంతో మెరిసింది. 64 బంతుల్లో 124 పరుగులు సాధించిన స్మృతి మంధాన మహిళల టీ20 క్రికెట్‌లో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకుంది. సెంచరీతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న అనంతరం కన్నీటిపర్యంతమైంది. అయితే ఈ కన్నీళ్లు సంతోషంతోనే తప్ప బాధతో వచ్చనవి కావని మంధాన మీడియాతో పేర్కొంది.

అనంతరం మ్యాచ్‌లో మీరు చేసిన సెంచరీని ఎవరికి అంకితం చేస్తారని ప్రశ్న వేయగా.. ‘‘ఈ సెంచరీని అంకితం చేయడానికి నా మైండ్‌లో ఎవరు లేరు. కానీ ఈ శతకాన్ని మాత్రం కచ్చితంగా నా ఫ్యామిలీకే అంకితమిస్తాను. హాంకాంగ్‌తో తొలిసారి మ్యాచ్ ఆడుతున్నందున ఆ జట్టు గురించి మాకు ఎలాంటి అవగాహన లేదు. వాళ్ల బౌలింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను మ్యాచ్‌కు ముందు రోజు వీక్షించాము. 


Photo Credit: BCCI Twitter

ఒక తెలియని బౌలర్ మన ముందుకు వచ్చినప్పుడు వారి గురించి కాకుండా ఆటపై మాత్రమే దృష్టిపెడతాను. వస్తాను, బంతిని చూస్తాను, కొడతాను అన్న తరహాలోనే నా బ్యాటింగ్ కొనసాగుతుంది. అయితే పవర్ ప్లేలో కొన్ని ఫుల్‌టాస్ బంతులను వదిలేశాను. నిజానికి ఫుల్‌టాస్ బంతులు నా బలం కాదు.. బలహీనత. వాటిని వదిలేసినప్పుడు మనసులో కాస్త సంతోషపడ్డాను. ఎందుకంటే అప్పుడు వదిలేయకుంటే సెంచరీ వచ్చేది కాదేమో. 


Photo Credit: BCCI Twitter

టాపార్డర్‌లో ఆడుతాం కాబట్టే బ్యాటర్‌కు సెంచరీ చేసే అవకాశం వస్తోంది. టీ20 క్రికెట్‌లో టాపార్డర్ మినహా మిగతా ఏ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఈ సెంచరీతో నేను ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టానన్న విషయం నాకు తెలియదు. ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ రికార్డులేంటన్నివి చూశాను’’ అని  స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.

మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ స్మృతి మంధాన (64 బంతుల్లో 124) సెంచ‌రీ సాధించింది. అనంత‌రం భార‌త బౌల‌ర్ల ధాటికి హాంకాంగ్ వుమెన్స్ 16.2 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగుల‌కు ఆలౌట‌య్యారు. దీప్తి శ‌ర్మ మూడు వికెట్లు తీయ‌గా, నంద‌ని శ‌ర్మ‌, శ్రీ చ‌ర‌ణి, ప్రేమా రావ‌త్‌లు త‌లా 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

చదవండి: టీ20 క్రికెట్‌లో చరిత్ర తిరగరాసిన తెలుగు క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement