క్రికెట్‌ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం.. వరుస మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్స్‌ | English Cricketer Takes Two Hat Tricks In Consecutive Matches In A Rare Feat | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం.. వరుస మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్స్‌

Sep 4 2026 4:57 AM | Updated on Sep 4 2026 4:56 AM

English Cricketer Takes Two Hat Tricks In Consecutive Matches In A Rare Feat

source: X

క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించడం అంత సులభం కాదు. అలాంటిది ఒకే వారంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ సాధిస్తే, అది అత్యంత అరుదైన ఘనత అవుతుంది. ఇంగ్లండ్ యువ పేసర్ హెన్రీ క్రోకోంబ్ ఇప్పుడు ఇదే సంచలన రికార్డును సాధించాడు. 

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్ తరఫున ఆడుతున్న ఈ 24 ఏళ్ల బౌలర్.. వరుస కౌంటీ మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌లు నమోదు చేసి అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు.

వారం వ్యవధిలోనే రెండు హ్యాట్రిక్‌లు
ఆగస్టు చివరి వారంలో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రోకోంబ్ తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో క్రోకోంబ్ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. ఆ హ్యాట్రిక్ జ్ఞాపకం ఇంకా చెరిగిపోకముందే క్రోకోంబ్ మరోసారి అదే ఫీట్‌ను రిపీట్‌ చేశాడు. గురువారం ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వారం వ్యవధిలో తన రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.

ఏడో బౌలర్
వరుస ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్ల జాబితాలో క్రోకోంబ్ ఏడో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో జార్జ్ ఫ్రీమన్ (1868), జోగిందర్ రావు (1963), మైక్ ప్రాక్టర్ (1979), డీన్ హెడ్లీ (1996), వసీం అక్రమ్ (1999), దీపక్ ధపోలా (2024) ఉన్నారు.

సూపర్‌ ఫామ్‌లో క్రోకోంబ్
సస్సెక్స్ అకాడమీ నుంచి వచ్చిన క్రోకోంబ్ ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-1లో అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొడుతు​న్నాడు. తొలి 11 మ్యాచ్‌ల్లో  43 వికెట్లు పడగొట్టి సస్సెక్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో క్రోకోంబ్‌ ఇప్పటివరకు 79 ఇన్నింగ్స్‌ల్లో 118 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శనల తర్వాత క్రోకోంబ్‌ జాతీయ జట్టు నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. 
చదవండి: మరోసారి చెలరేగిన భువీ.. టీమిండియా సెలెక్టర్లకు సవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement