Photo Credit: Twitter
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో బిజీగా గడుపుతున్నాడు. నైట్‌క్లబ్ ఉదంతంతో ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయిన స్టోక్స్ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కౌంటీ చాంపియన్‌షిప్‌లో స్టోక్స్ డుర్హమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదే టోర్నీలో గ్లౌసెస్టర్‌షైర్ జట్టుకు భారత బౌలర్ సాయి కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మ్యాచ్ సమయంలో వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసలై నైట్‌క్లబ్ ఉదంతంతో అవమానం పాలైన స్టోక్స్‌ను సాయి కిషోర్ చావుదెబ్బ తీశాడు. గ్లౌసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్ సమయంలో సాయికిషోర్ బ్యాటింగ్‌కు రాగా, అతడిని స్టోక్స్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. తనను ఔట్ చేసిన స్టోక్స్‌పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న సాయికిషోర్‌కు ఆ వెంటనే బదులు తీర్చుకునే అవకాశం కలిగింది.

PC: Twitter
డుర్హమ్ జట్టు తరఫున 45 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్‌ను సాయి కిషోర్ తెలివైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఫ్లైటెడ్ డెలివరీగా వచ్చిన బంతిని డిఫెన్స్ ఆడే యత్నంలో స్టోక్స్ మిస్ చేయడంతో వికెట్లను గిరాటేసింది. దీంతో తనను ఔట్ చేసిన స్టోక్స్‌ను పెవిలియన్ చేర్చిన ఆనందంలో సాయి కిషోర్ ఎగిరి గంతేశాడు. పనిలో పనిగా తన రివేంజ్‌ను కూడా తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్‌షైర్ 42 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ జేమ్స్ బ్రాసీ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఓలీ ప్రైస్ (27) పర్వాలేదనిపించాడు. డుర్హమ్ బౌలర్లలో కాసీ అల్డ్రిడ్జ్ 5 వికెట్లు తీయగా, బైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం డుర్హమ్ 60 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఓలీ రాబిన్‌సన్ (28), కేసీ ఆల్డ్రిడ్జ్ (3) పరుగులతో ఆడుతున్నారు. డేవిడ్ బెల్లింగ్‌హమ్ (122) సెంచరీ సాధించగా, బెన్ స్టోక్స్ (45) రాణించాడు. ప్రస్తుతం డుర్హమ్ 160 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సాయి కిషోర్, జేమ్స్ థామస్, జలాల్ అహ్మద్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
Sai Kishore... ladies and gentlemen!
Ben Stokes is bowled, and there isn't a lot you can do about deliveries like that!#BecomeGlorious pic.twitter.com/b8WbN3jXEy— Gloucestershire Cricket (@Gloscricket) August 28, 2026
Day 1:
Sai Kishore b Ben Stokes
Day 2:
Ben Stokes b Sai Kishore
🔄#CountyChampionship pic.twitter.com/OLlvP2aC7e— Cricbuzz (@cricbuzz) August 28, 2026
Read: ఆర్చర్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో రెండోసారి మాత్రమే!


