Photo Credit: BCCI Twitter
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ బుధవారం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో ఎసెక్స్ తరఫున ఆడుతున్న డీన్ ఎల్గర్, 2026 కౌంటీ సీజన్ తనకు చివరి టోర్నీ అని, ఆ తర్వాత క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు.
2012లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన డీన్ ఎల్గర్ 2024లో కేప్‌టౌన్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018లో చివరి వన్డే ఆడాడు. అప్పటినుంచి కౌంటీల్లో కొనసాగుతూ వచ్చాడు. తాజాగా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎల్గర్ ప్రకటన విడుదల చేశాడు.
2012 నుంచి 2024 మధ్య సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన డీన్ ఎల్గర్ నిఖార్సైన టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. తన 12 ఏళ్ల కెరీర్‌లో టెస్టులకు మాత్రమే పరిమితమైన డీఎన్ ఎల్గర్ 2017లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ వ్యక్తిగత కారణాలతో దూరమైనప్పుడు అతడి స్థానంలో ఎల్గర్ బాధ్యతలు చేపట్టాడు.
2021లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు డీన్ ఎల్గర్ తొలిసారి టెస్టు కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. అతడి సారథ్యంలో దక్షిణాఫ్రికా 18 టెస్టులు ఆడగా, ఇందులో 9 విజయాలు, ఏడు ఓటములు, రెండు డ్రాలు ఉన్నాయి. కెప్టెన్‌గా డీన్ ఎల్గర్ సక్సెస్ రేటు 50శాతం ఉండడం గమనార్హం.
21 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో డీన్ ఎల్గర్ 278 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 18,925 పరుగులు, 178 లిస్ట్-ఏ క్రికెట్ మ్యాచ్‌ల్లో 6,264 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున డీన్ ఎల్గర్ 86 టెస్టుల్లో 5,347 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి.
కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్‌లో ఎసెక్స్ మరో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది , ఇందులో భాగంగా సర్రేతో వారి మ్యాచ్ ఆగస్టు 27న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 24న గ్లామోర్గాన్‌తో జరిగే మ్యాచ్‌తో ఎసెక్స్ తమ సీజన్‌ను ముగించనుంది. దీంతో ఎల్గర్ ప్రొఫెషనల్ కెరీర్‌కు కూడా ఎండ్‌కార్డ్ పడనుంది.


