breaking news
County Championship
-
ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రంలోనే శతక్కొట్టిన తిలక్ వర్మ
తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు, టీమిండియా టీ20 స్పెషలిస్ట్ తిలక్ వర్మ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్-2025లో ఆడేందుకు ఇటీవలే హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న తిలక్.. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఎసెక్స్‌తో రెండు రోజుల క్రితం ప్రారంభమైన మ్యాచ్‌లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (34/2) బరిలోకి దిగిన తిలక్.. ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి కాగానే హార్మర్ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కాగా.. హ్యాంప్‌షైర్ 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది (మూడో రోజు తొలి సెషన్). తిలక్ ఔట్ కాగానే మరో హ్యాంప్‌షైర్ ఆటగాడు లియామ్ డాసన్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో చార్లీ అల్లీసన్ (101) సెంచరీతో కదంతొక్కాడు.కాగా, తిలక్ ఇటీవలే హ్యాంప్‌షైర్‌తో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 18 నుండి ఆగస్టు 2 వరకు ఈ జట్టుకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించాడు. ఈ ఒప్పందంలో తిలక్ నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. వైట్‌బాల్ గేమ్స్ ఆడతాడో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో టీ20 బ్లాస్ట్ టోర్నీ జరుగుతోంది.22 ఏళ్ల తిలక్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు 18 ఫస్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. టీమిండియా తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడిన తిలక్.. టీ20ల్లో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అతను 24 ఇన్నింగ్స్‌లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు.తిలక్‌కు ముందు మరో ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్లు, టీ20 స్పెషలిస్ట్‌లు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్తో.. రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్‌తో జతకట్టారు. ఇషాన్ కూడా తిలక్ తరహాలోనే తన కౌంటీ అరంగేట్రంలో ఇరగదీశాడు. యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. -
అరంగేట్రంలోనే అదరగొట్టిన ఇషాన్ కిషన్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కౌంటీ క్రికెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కేవలం 57 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 83 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. కౌంటీల్లో ఇషాన్‌కు ఇదే తొలి అసైన్మెంట్. ఇటీవలే అతను నాటింగ్హమ్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టుతో ఇషాన్ ఒప్పందం కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ జాతీయ విధులు హాజరయ్యేందుకు జింబాబ్వేకు వెళ్లడంతో (రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం) నాటింగ్హమ్షైర్ ఇషాన్‌తో స్వల్ప కాలిక ఒప్పందం చేసుకుంది. డివిజన్–1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా నాటింగ్హమ్షైర్ యార్క్‌షైర్‌తో తలపడుతుంది. రెండో రోజు తొలి సెషన్లో నాటింగ్హమ్షైర్ 348/6గా ఉంది. ఇషాన్, లియామ్ పాటర్సన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు నాటింగ్హమ్ ఇన్నింగ్స్‌లో హసబ్ హమీద్ 52, బెన్ స్లేటర్ 96, ఫ్రెడ్డీ 23, జో క్లార్క్ 31, జాక్ హేన్స్ 18, లిండన్ జేమ్స్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. యార్క్‌షైర్ బౌలర్లలో జార్జ్ హిల్, డేనియల్ మోరియార్టీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ వైట్, విలయమ్ ఓరూర్కీ చెరో వికెట్ దక్కించుకున్నారు.10 రోజుల్లో మూడో ఆటగాడు..10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఒప్పందం కుదర్చుకున్న మూడో భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. కిషన్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్‌షైర్, హాంప్షైర్లతో జతకట్టారు.ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బీసీసీఐ నిబంధనలు ఉల్లఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇషాన్.. తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు.టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఇషాన్‌కు పిలుపు వచ్చే అవకాశముంది. -
నిన్ను నిందించం.. విరాట్ రిటైర్మెంట్పై వ్యంగ్యంగా స్పందించిన కౌంటీ ఛాంపియన్షిప్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై కౌంటీ ఛాంపియన్షిప్ (ఇంగ్లండ్) వ్యంగ్యంగా స్పందించింది. ఇంగ్లండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ దేశవాలీ టోర్నీలో చెలరేగి వికెట్లు తీస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. నిన్ను నిందించం విరాట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. కౌంటీ ఛాంపియన్షిప్ విరాట్‌ను తక్కువ చేస్తూ పెట్టిన ఈ పోస్ట్‌పై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విరాట్‌ను అడ్డుకునేంత శక్తి ఇంగ్లండ్ పేసర్లకు లేదని కామెంట్లు చేస్తున్నారు.కౌంటీ ఛాంపియన్షిప్ ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే.. భారత క్రికెట్ జట్టు జూన్ 20 నుండి ఇంగ్లండ్‌లో (తో) ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ అట్కిన్సన్, టంగ్‌ను ఎదుర్కోవాల్సి ఉండింది. ఇవాళ ఉదయం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో విరాట్ అట్కిన్సన్, టంగ్ నుంచి ఎదురయ్యే సవాళ్లను తప్పించుకున్నాడన్న అర్దంతో కౌంటీ ఛాంపియన్షిప్ ఈ పోస్ట్‌ను చేసింది.వాస్తవానికి అట్కిన్సన్కు కానీ టంగ్‌కు కానీ విరాట్‌కు అడ్డుకట్ట వేసేంత సీన్ లేదు. విరాట్ ముందు వాళ్లిదరూ సాధారణ పేసర్లు. ఒకవేళ విరాట్ రిటైర్ కాకుండా వారిని ఎదుర్కోవాల్సి వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో వరుస పెట్టి హాఫ్ సెంచరీలు చేస్తూ.. తన జట్టును (ఆర్సీబీ) తొలి టైటిల్ దిశగా తీసుకెళ్తున్నాడు.విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. అనుభవజ్ఞులైన రోహిత్, విరాట్ ఇంగ్లండ్ లాంటి కఠినమైన సిరీస్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ప్రతికూలతే అవుతుంది. ఈ సిరీస్ కోసం కొత్త జట్టును, అలాగే టీమిండియా నూతన టెస్ట్ సారధిని మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ వాయిదా పడటంతో ఖాళీగా ఉన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. ఐపీఎల్ పూర్తయ్యాక జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.ఇంగ్లండ్ పర్యటనలో భారత షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్, లండన్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31- ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్ట్న్ ఓవల్, లండన్) -
సాయి సుదర్శన్ సంచలనం.. సిక్స్‌తో సెంచరీ! వీడియో
టీమిండియా యువ సంచలనం సాయిసుదర్శన్ ఇంగ్లండ్ కౌంటీల్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. కౌంటీ ఛాంపియన్ షిప్-2024లో సర్రే క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాటింగ్‌హామ్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సాయిసుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.సిక్స్‌తో తన తొలి కౌంటీ సెంచరీ మార్క్‌ను ఈ తమిళనాడు బ్యాటర్ అందుకున్నాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుదర్శన్.. తొలి ఇన్నింగ్స్‌లో సర్రే 525 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా 178 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ రోరీ బర్న్స్(161) కూడా సెంచరీతో రాణించాడు. కాగా కౌంటీల్లో సుదర్శన్ ఆడటం ఇదే రెండో సారి. గతేడాది కౌంటీ ఛాంపియన్ షిప్లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో సర్రే తరపున ఆడాడు.అయితే ఈ ఏడాది సీజన్ మొత్తానికి అతడు అందుబాటులో ఉండడం లేదు. సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అతడు తిరిగి స్వదేశానికి రానున్నాడు.భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించే సి టీమ్‌లో సాయికి చోటు దక్కింది. అయితే ఇప్పటికే వన్డేల్లో అరంగేట్రం చేసిన సుదర్శన్.. దులీప్ ట్రోఫీలో రాణిస్తే టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సఫారీ క్రికెటర్ -
పుజారాకు నిరాశ..!
లండన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా వచ్చే ఏడాది కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోడని గురువారం ససెక్స్ క్లబ్ వెల్లడించింది. పుజారా స్థానంలో ఆ్రస్టేలియా ఆటగాడు డేనియల్ హ్యూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.గత మూడేళ్లుగా ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారాను ఈసారి ఆ క్లబ్ రిటైన్ చేసుకోలేదు. ‘పుజారాను కాదని హ్యూస్‌ను ఎంపిక చేసుకోవడం కష్టమైన పనే. కానీ, హ్యూస్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. అంతేకాక టి20 మ్యాచ్‌లు కూడా ఆడతాడు. పుజారాకు సరైన ప్రత్యామ్నాయం అతడే అనిపించింది’ అని ససెక్స్ హెడ్ కోచ్ పాల్ ఫార్బస్ అన్నాడు.