
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై కౌంటీ ఛాంపియన్‌షిప్ (ఇంగ్లండ్) వ్యంగ్యంగా స్పందించింది. ఇంగ్లండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ దేశవాలీ టోర్నీలో చెలరేగి వికెట్లు తీస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. నిన్ను నిందించం విరాట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. కౌంటీ ఛాంపియన్‌షిప్ విరాట్‌ను తక్కువ చేస్తూ పెట్టిన ఈ పోస్ట్‌పై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విరాట్‌ను అడ్డుకునేంత శక్తి ఇంగ్లండ్ పేసర్లకు లేదని కామెంట్లు చేస్తున్నారు.
కౌంటీ ఛాంపియన్‌షిప్ ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే.. భారత క్రికెట్ జట్టు జూన్ 20 నుండి ఇంగ్లండ్‌లో (తో) ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ అట్కిన్సన్, టంగ్‌ను ఎదుర్కోవాల్సి ఉండింది. ఇవాళ ఉదయం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో విరాట్ అట్కిన్సన్, టంగ్ నుంచి ఎదురయ్యే సవాళ్లను తప్పించుకున్నాడన్న అర్దంతో కౌంటీ ఛాంపియన్‌షిప్ ఈ పోస్ట్‌ను చేసింది.
వాస్తవానికి అట్కిన్సన్‌కు కానీ టంగ్‌కు కానీ విరాట్‌కు అడ్డుకట్ట వేసేంత సీన్ లేదు. విరాట్ ముందు వాళ్లిదరూ సాధారణ పేసర్లు. ఒకవేళ విరాట్ రిటైర్ కాకుండా వారిని ఎదుర్కోవాల్సి వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో వరుస పెట్టి హాఫ్ సెంచరీలు చేస్తూ.. తన జట్టును (ఆర్సీబీ) తొలి టైటిల్ దిశగా తీసుకెళ్తున్నాడు.
విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. అనుభవజ్ఞులైన రోహిత్, విరాట్ ఇంగ్లండ్ లాంటి కఠినమైన సిరీస్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ప్రతికూలతే అవుతుంది. ఈ సిరీస్ కోసం కొత్త జట్టును, అలాగే టీమిండియా నూతన టెస్ట్ సారధిని మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ వాయిదా పడటంతో ఖాళీగా ఉన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. ఐపీఎల్ పూర్తయ్యాక జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.
ఇంగ్లండ్ పర్యటనలో భారత షెడ్యూల్..
జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)
జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)
జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్, లండన్)
జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)
జులై 31- ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్ట్‌న్ ఓవల్, లండన్)