భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం! | ICC could suffer INR 2289 crore loss if Pakistan boycotts India match in T20 World Cup | Sakshi
Sakshi News home page

భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం!

Feb 3 2026 8:33 AM | Updated on Feb 3 2026 8:50 AM

ICC could suffer INR 2289 crore loss if Pakistan boycotts India match in T20 World Cup

క్రికెట్ ప్ర‌పంచంలో భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జ‌ట్లు ఎప్పుడెప్పుడూ త‌ల‌ప‌డ‌తాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా చిరకాల ప్రత్యర్ధులు కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడతున్నాయి. అయితే మ‌రోసారి దాయాదుల పోరు చూడాలనుకున్న అభిమానుల‌కు నిరాశే ఎదురయ్యే అవకాశముంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్‌తో జ‌ర‌గాల్సిన లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. టోర్నీలో ఇతర జట్లతో ఆడుతామని, కానీ భారత్‌తో మాత్రం తలపడబోమని పాక్‌ స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పాక్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది.

ఐసీసీకి భారీ నష్టం..
ఒకవేళ భారత్‌-పాక్ మ్యాచ్ రద్దు అయితే అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు భారీ న‌ష్టం వాటిల్లే అవ‌కాశ‌ముంది. ఐసీసీ ప్రసార హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ. 27,465 కోట్లు)గా ఉంది. ఇందులో 40 శాతం కంటే ఎక్కువ ఆదాయం ఒక్క భారత్-పాక్ మ్యాచ్‌ల నుంచే వస్తుంది.

గ‌త మూడేళ్ల‌లో జ‌రిగిన ప్రతీ భారత్-పాక్ మ్యాచ్ విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,289 కోట్లు)గా ఉంది. అదేవిధంగా  టోర్నీ బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ ఈ మ్యాచ్ ద్వారా వచ్చే భారీ యాడ్స్ రెవెన్యూ కోల్పోతుంది. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది. దీంతో ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవ‌కాశ‌ముంది. పాక్ త‌మ మొండి ప‌ట్టు వీడ‌క‌పోతే ఆ న‌ష్టాన్ని వారి నుంచే ఐసీసీ రాబ‌ట్ట‌నుంది.
చదవండి: T20 WC 2026: భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కట్‌.. పాకిస్తాన్‌ మరో కొత్త డ్రామా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement