విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్‌ ఆజమ్‌ | Babar Azam breaks HUGE Virat Kohli record with fighting fifty in PAK vs AUS 3rd T20I | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్‌ ఆజమ్‌

Feb 1 2026 7:39 PM | Updated on Feb 1 2026 8:17 PM

Babar Azam breaks HUGE Virat Kohli record with fighting fifty in PAK vs AUS 3rd T20I

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ భారత దిగ్గజం విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్‌ సెంచరీ చేసిన బాబర్‌.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. 

ఈ రికార్డు విరాట్‌ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్‌ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్‌, విరాట్‌ తర్వాతి స్థానాల్లో రోహిత్‌ శర్మ (32), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (30), డేవిడ్‌ వార్నర్‌ (28), జోస్‌ బట్లర్‌ (28) ఉన్నారు.

మరో రికార్డు
తాజా హాఫ్‌ సెంచరీతో బాబర్‌ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్‌ లెజెండ్‌ క్రిస్‌ గేల్‌ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఫామ్‌లోకి వచ్చిన బాబర్‌
BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్‌ల్లో 202 పరుగులు) చేసిన బాబర్‌.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి, ఫామ్‌లోకి వచ్చాడు.

మ్యాచ్‌ పరిస్థితి  
లాహోర్‌ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్‌ చేసింది. సైమ్‌ అయూబ్‌ (56), బాబర్‌ ఆజమ్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్‌ ఖాన్‌ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆసీస్‌ బౌలర్లలో డ్వార్షుయిస్‌ 2, గ్రీన్‌, కన్నోలీ, షార్ట్‌, కుహ్నేమన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన పాక్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement