(PC: Twitter)
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ తమ దేశం తరఫున క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రాన్స్‌జెండర్ పాలసీ కింద అనయా బంగర్ తన టెస్టోస్టిరాన్ లెవెల్స్‌కు సంబంధించి రిపోర్ట్స్ పంపిస్తే ఎలైట్ క్రికెట్ ఆడడంతో పాటు మహిళల బిగ్‌బాష్ ఆడేందుకు అనుమతిస్తామని సీఏ ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజనే కాప్ బహిరంగంగా విమర్శలు వ్యక్తం చేసింది. "ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌గా అనయా బంగర్ క్రికెట్ ఆడేందుకు అనుమతించొద్దు. ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆవలంబిస్తున్న వైఖరి పట్ల నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.
అనయా బంగర్ మహిళా క్రికెటర్ ఎంతమాత్రం కాదు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ అథ్లెట్. ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఆమె క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించొద్దని బహిరంగంగా పేర్కొంటున్నా" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
ఇక భారత మాజీ క్రికెటర్, కోచ్ అయిన సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్, ఈ ఏడాది మార్చిలో లింగ నిర్థారణ శస్త్రచికిత్స చేయించుకుంది. అనయా బంగర్‌కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్, లింగ వైవిధ్య క్రీడాకారుల చేరిక విధానంలో అనయా బంగర్‌కు తమ దేశం తరఫున క్రికెట్ ఆడేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపింది.
క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్, లింగ వైవిధ్య ఆటగాళ్ల విధానం ప్రకారం, సదరు ప్లేయర్ అర్హత పొందాలంటే ఒక ఆటగాడి సీరం టెస్టోస్టెరాన్ కనీసం 12 నెలల పాటు 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ తాము కోరిన విధంగా ఆమె చేయించుకున్న పరీక్షల్లో రిపోర్ట్స్ అన్నీ అనుకూలంగా ఉంటే 2027 మార్చి నుంచి ఆస్ట్రేలియా ఎలైట్ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు అనయా బంగర్‌కు అర్హత లభిస్తుంది అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
కాగా జాక్వి పార్ట్రిడ్జ్ (CA, హెడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ), ఎమిలీ యేట్స్ (CA, ఇంటిగ్రిటీ పార్టనర్, లీగల్), పీటర్ రోచ్ (CA హెడ్ ఆఫ్ షెడ్యూలింగ్, ఆపరేషన్స్ అండ్ డొమెస్టిక్ క్రికెట్), డాక్టర్ పీటర్ హార్కోర్ట్ (CA, యాంటీ-డోపింగ్ మెడికల్ ఆఫీసర్), డాక్టర్ పిప్ ఇంగే (CA టీమ్ డాక్టర్)లతో కూడిన నిపుణుల ప్యానెల్ అనయా బంగర్ కేసుపై దృష్టి సారించి, మెడికల్ రిపోర్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
ఇదే విషయంపై అనయా బంగర్ స్పందిస్తూ.. "అర్హత అనేది ఎంపిక కాదు. ట్రాన్స్‌జెండర్లకు ఎక్కడా ఆడే వీలు లేని సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. అంతమాత్రానా నాకు జట్టులో స్థానం లభించినట్లు కాదని గుర్తుంచుకోండి. వాళ్లు పెట్టిన షరతులన్నీ అంగీకరించడంతో పాటు టెస్టుల్లో అనుకూల ఫలితాలు వస్తేనే నేను విజయవంతమైనట్లుగా భావిస్తాను.
అన్నీ సక్రమంగా జరిగి ఎంపికైనా గెలుపు సాధించినట్లు కాదు. స్థానం నిలబెట్టుకోవాలంటే నేను ఇంకా శిక్షణ పొందాలి, పోటీ పడాలి, రాణించాలి. ఒక క్రికెటర్‌గా నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని నేను కోరుకుంటున్నా" అని చెప్పుకొచ్చింది. ట్రాన్స్‌జెండర్లకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం లేదని, 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో వారిపై నిషేధం విధించింది. అందుకే భారత్ తరఫున ఆడే అవకాశం లేనందునే అనయా బంగర్ క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతోంది.
#WATCH | Mumbai, Maharashtra: On making a comeback in cricket, Anaya Bangar, a cricketer and the daughter of former Indian international cricketer and national batting coach, Sanjay Bangar, said, "...I am preparing to return to women's cricket in Australia with the aim of… pic.twitter.com/NVgrICOjgT
— ANI (@ANI) August 27, 2026
🚨South African cricketer Marizanne Kapp criticizes Anaya Bangar's inclusion in women's cricket🚨
Marizanne Kapp:🗣️ I honestly don't think it's fair to the other women cricketers. Cricket Australia's decision to allow Anaya Bangar to play in the Women's Big Bash is hard to… pic.twitter.com/GodPoWTykc— Central Cricket (@arshdeep3444) August 28, 2026
Read: ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె!


