శ్రీలంకతో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సాయి సుదర్శన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్.. తన సంచలన బ్యాటింగ్‌తో సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలు సాధించి మూడో నంబర్‌కు తానే సరైనోడని నిరూపించుకున్నాడు. ఈ కర్ణాటక బ్యాటర్ మొత్తంగా 328 పరుగులు చేసి ప్లేయర్‌గా ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పడిక్కల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"పడిక్కల్ ఒక అద్భుతమైన ఆటగాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ శైలి చూడటానికి ఎంతో బాగుంది. పడిక్కల్ లాంటి ఆటగాడు ఆటగాడు జట్టులో ఉండడం భారత్ అదృష్టం. మూడో స్ధానానికి అతడే సరైన ప్లేయర్" అని పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. మరోవైపు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా పడిక్కల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
‘‘పడిక్కల్ లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు స్పిన్ బాగా ఆడుతున్నాడు. పేస్ బౌలర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో అతడు భారత్‌కు కీలకంగా మారనున్నాడు" అని జడేజా సోనీ స్పోర్ట్స్ డిబేట్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ భారత్ తమ తదుపరి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం డిసెంబర్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
చదవండి: ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్


